Ruturaj Gaikwad : “కుర్రాడు ధోని” సిక్సులే కాపాడాయి : రుతురాజ్ గైక్వాడ్‌

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ అద‌ర‌గొడుతోంది.

Ruturaj Gaikwad : “కుర్రాడు ధోని” సిక్సులే కాపాడాయి : రుతురాజ్ గైక్వాడ్‌

CSK captain Ruturaj Gaikwad credits Dhoni and Pathirana for MI win

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ అద‌ర‌గొడుతోంది. ఆదివారం వాంఖ‌డే వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 20 ప‌రుగుల తేడాతో సీఎస్‌కే విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఇన్నింగ్స్ ఆఖ‌రి ఓవ‌ర్‌లో మ‌హేంద్ర సింగ్ ధోని హ్యాట్రిక్స్ సిక్స‌ర్లు బాది చెన్నై స్కోరును 200 దాటించాడు. అనంత‌రం బౌలింగ్‌లో మ‌తిషా ప‌తిర‌ణ నాలుగు వికెట్లతో చెల‌రేగాడు. వీరిద్ద‌రు చెన్నై విజ‌యంలో కీలక పాత్ర పోషించార‌ని ఆ జ‌ట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చెప్పాడు.

మ్యాచ్ అనంత‌రం రుతురాజ్ మాట్లాడుతూ.. ముంబై పై సీఎస్‌కే విజ‌యం సాధించ‌డంలో ప్ర‌తి ఒక్క‌రి పాత్ర ఉంద‌న్నాడు. అయితే.. యువ వికెట్ కీప‌ర్ (ధోనిని ఉద్దేశించి) కొట్టిన హ్యాట్రిక్ సిక్స‌ర్లు జ‌ట్టును ఆదుకున్నాయ‌ని చెప్పాడు.

Sunil Gavaskar : హార్దిక్‌ది చెత్త బౌలింగ్‌.. అత‌డి వ‌ల్లే ఓట‌మి : నయా కెప్టెన్ పై సునీల్ గ‌వాస్క‌ర్ ఫైర్‌

మేం చేసిన స్కోరు కంటే మ‌రో 10 నుంచి 15 ప‌రుగులు ఎక్కువ చేయాల్సింది అని అనుకున్నాను. అయితే.. బుమ్రా చ‌క్క‌గా బౌలింగ్ చేశాడు. ఇక ల‌క్ష్య ఛేద‌న‌లో హార్డ్ హిట్ట‌ర్లు ఉన్న ముంబైని క‌ట్ట‌డి చేయ‌డం అంత సుల‌భం కాద‌న్న సంగ‌తి తెలుసన‌న్నాడు.

అయితే.. యువ మ‌లింగ (ప‌తిర‌న‌) గొప్ప‌గా బౌలింగ్ చేశాడ‌ని, యార్క‌ర్ల‌తో అద‌ర‌గొట్టాడన్నారు. శార్దూల్‌, తుషార్‌లు సైతం స‌త్తా చాటారని చెప్పారు. ప్ర‌ణాళిక‌ల‌ను స‌రిగ్గా అమ‌లు చేయాల‌ని మ్యాచ్ ముందు నుంచి అనుకుంటున్నాం. ఇక అజింక్య ర‌హానేను ఓపెన‌ర్‌గా పంప‌డానికి ఓ కార‌ణం ఉంది. అతడు వ‌న్‌డౌన్‌లో ఇబ్బంది ప‌డుతున్నాడు. అందుక‌నే అత‌డిని ఓపెన‌ర్‌గా పంపామ‌ని తెలిపాడు. ఇక తాను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయ‌డానికి సిద్ద‌మేన‌ని, కెప్టెన్ కావ‌డంతో త‌న పై బాధ్య‌త మ‌రింత పెరిగింద‌ని రుతురాజ్ చెప్పాడు.

Ruturaj Gaikwad : రుతురాజ్ గైక్వాడ్ అరుదైన ఘ‌న‌త‌.. ధోని, కోహ్లిల వ‌ల్ల కాలేదు..