IPL 2024 : రుతురాజ్, దూబె విజృంభణ.. ముంబైపై 20 పరుగుల తేడాతో చెన్నై విజయం!

IPL 2024 - MI vs CSK : కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (69; 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సు), శివమ్ దూబె (66 నాటౌట్; 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్) హాఫ్ సెంచరీలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

IPL 2024 : రుతురాజ్, దూబె విజృంభణ.. ముంబైపై 20 పరుగుల తేడాతో చెన్నై విజయం!

IPL 2024 - MI vs CSK _ Chennai Super Kings win by 20 runs vs Mumbai Indians

Updated On : April 15, 2024 / 12:38 AM IST

IPL 2024 : ముంబై ఇండియన్స్‌కు చెన్నై సూపర్ షాకిచ్చింది. సొంత మైదానంలోనే ముంబైని చెన్నై చిత్తుగా ఓడించింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ముంబైపై సీఎస్‌కే గెలిచింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో చెన్నై నాల్గో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. లక్ష్య ఛేదనలో ముంబై జట్టు రోహిత్ శర్మ (105; 63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్) సెంచరీ చేసినప్పటకీ జట్టును గెలిపించలేకపోయాడు. కానీ, ఈ ఐపీఎల్‌లో రోహిత్‌కు ఇది రెండో సెంచరీ.

చెన్నై బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో ముంబై మిగతా ఆటగాళ్లలో తిలక్ వర్మ (31), ఇషాన్ కిషాన్ (23), టిమ్ డేవిడ్ (13) పరుగులతో రాణించగా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా (2), రొమారియో షెపర్డ్ (1), మహమ్మద్ నబీ (4) పరుగులకే పెవిలియన్ చేరారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులకే ముంబై చేతులేత్తేసింది. చెన్నై బౌలర్ మతీష పతిరన ఏకంగా 4 వికెట్లు తీసుకోగా, తుషార్ దేశ్ పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్ తలో వికెట్ తీసుకున్నారు.

హాఫ్ సెంచరీలతో మెరిసిన రుతురాజ్, దూబె :
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టులో ఓపెనర్ అజింక్య రహానే (5) చేతులేత్తేయగా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (69; 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సు), శివమ్ దూబె (66 నాటౌట్; 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్) హాఫ్ సెంచరీలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫలితంగా చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది.

దాంతో ముంబైకి 207 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రచిన్ రవీంద్ర (21), ఎంఎస్ ధోనీ (20 నాటౌట్), డారిల్ మిచెల్ (17) పరుగులతో పర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీసుకోగా, గెరాల్డ్ కోయెట్జీ, శ్రేయాస్ గోపాల్ తలో వికెట్ తీసుకున్నారు. ముంబై కీలక వికెట్లను పడగొట్టి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించిన మతీష పతిరన (4/28)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

టాప్ 3లో చెన్నై : 
పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌ల్లో గెలిచి రెండింట్లో ఓడి 8 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్ ఆడిన 6 మ్యాచ్‌ల్లో 2 గెలిచి 4 మ్యాచ్‌‌ల్లో ఓడి 4 పాయింట్లతో 8వ స్థానంలోకి పడిపోయింది.

Read Also : చెలరేగిన స్టార్క్‌, సాల్ట్.. లక్నో సూపర్ జెయింట్స్‌పై కేకేఆర్ భారీ గెలుపు