Rohit Sharma loses top spot in Latest ICC ODI rankings
Rohit Sharma : టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మకు షాక్ తగిలింది. నెలరోజుల వ్యవధిలోనే అతడు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ (119) చేసిన న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డారిల్ మిచెల్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో డారిల్ మిచెల్ రెండు స్థానాలు మెరుగుపరచుకుని తొలి స్థానానికి ఎగబాకాడు.
డారిల్ మిచెల్ ఖాతాలో 782 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇది అతడి కెరీర్‌లోనే అత్యుత్తమం. ఇక రెండో స్థానానికి పడిపోయిన రోహిత్ శర్మ (Rohit Sharma) ఖాతాలో 781 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. అంటే డారిల్, హిట్‌మ్యాన్‌కు మధ్య కేవలం ఒక్క రేటింగ్ పాయింట్ మాత్రమే అంతరం ఉంది.
కానీ వచ్చే వారం ర్యాంకింగ్ అప్‌డేట్‌లో డారిల్ మిచెల్ తన అగ్రస్థానాన్ని కోల్పోయే అవకాశం ఉంది. క్రైస్ట్‌చర్చ్‌లో మ్యాచ్ విన్నింగ్ సెంచరీ సమయంలో అతను గజ్జ గాయంతో బాధపడ్డాడు. ఇప్పటికే అతడు సిరీస్‌లోని చివరి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు.
ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో 83 ఇన్నింగ్స్‌ల తరువాత శతకాల కరువు ముగించిన పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజామ్ ఆరో స్థానానికి చేరుకున్నాడు. టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీలు వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఐసీసీ బ్యాటర్ల వన్డే ర్యాంకింగ్స్..
* డారిల్ మిచెల్ (న్యూజిలాండ్) – 782 రేటింగ్ పాయింట్లు
* రోహిత్ శర్మ (భారత్) – 781 రేటింగ్ పాయింట్లు
* ఇబ్రహిం జద్రాన్ (అఫ్గానిస్తాన్) – 764 రేటింగ్ పాయింట్లు
* శుభ్‌మన్ గిల్ (భారత్) – 745 రేటింగ్ పాయింట్లు
* విరాట్ కోహ్లీ (భారత్) – 725 రేటింగ్ పాయింట్లు
* బాబర్ ఆజాం (పాకిస్తాన్) – 722 రేటింగ్ పాయింట్లు