దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు భారత్ సిద్ధమవుతోన్న వేళ రోహిత్ శర్మ ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. టెస్టులకు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్‌లో భాగంగా ఆటలో మూడో రోజున సెప్టెంబర్ 28న ఇండియా బోర్డ్ ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టుతో టీమిండియా తలపడింది. విజయనగరం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగిన రోహిత్ ఇన్నింగ్స్ ఆరంభంలో రెండు బంతులు మాత్రమే ఆడి వెనుదిరిగాడు.
మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన రోహిత్ రెండో ఓవర్లో 2బంతులు ఆడాడు. ఫాస్ట్ బౌలర్ వెర్నాన్ ఫిలాండర్ వవేసిన బంతికి హెన్రిచ్ క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. అంతకంటే ముందు దక్షిణాఫ్రికా ప్లేయర్లు తొలి ఇన్నింగ్స్‌లో 6వికెట్ల నష్టానికి 279పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు.
రెండ్రోజుల ముందు టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ రోహిత్ శర్మ టెస్టుల్లోనూ ఓపెనర్ గా రావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పాడు. ఏదో ఒక మ్యాచ్ ఆడించి పరుగులు చేయడం లేదంటూ పక్కన పెట్టేస్తున్నారని అలా కాకుండా ఒక 10టెస్టులైనా ఆడించి తర్వాత అంచనా వేస్తే బాగుంటుందని యువీ చెప్పుకొచ్చాడు.