Bangladesh vs India: మొదటి టెస్టు నుంచి రోహిత్ శర్మ ఔట్.. జట్టులోకి అభిమన్యు

భారత్-బంగ్లాదేశ్ మధ్య ఈ నెల 14 నుంచి మొదటి టెస్టు మ్యాచు జరగనుంది. ఆ మ్యాచులో ఆడకుండా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. మొహమ్మద్ షమీ, రవీంద్ర జడేజాను ఈ టెస్టు సిరీస్ నుంచి పూర్తిగా తప్పించారు. వారు కూడా గాయాలకు చికిత్స తీసుకుంటున్నారు. వారి స్థానంలో నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్ ఆడనున్నారు. టెస్టు స్క్వాడ్ లోకి ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కట్ ను కూడా తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది.

Bangladesh vs India: భారత్-బంగ్లాదేశ్ మధ్య ఈ నెల 14 నుంచి మొదటి టెస్టు మ్యాచు జరగనుంది. ఆ మ్యాచులో ఆడకుండా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఇటీవల జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ గాయపడ్డ విషయం తెలిసిందే. ఆయన ఎడమచేతి బొటనవేలుకు గాయమైంది. దీంతో రోహిత్ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు.

ఆయన రెండో టెస్టు మ్యాచులో ఆడాలా? వద్దా? అన్న విషయం తర్వాత నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ చెప్పింది. దీంతో మొదటి టెస్టు జట్టులోకి అభిమన్యు ఈశ్వరన్ ను తీసుకుంటున్నట్లు బీసీసీఐ ప్రకటన చేసింది. కేఎల్ రాహుల్ టీమిండియాకు సారథ్యం వహించనున్నాడు.

అలాగే, మొహమ్మద్ షమీ, రవీంద్ర జడేజాను ఈ టెస్టు సిరీస్ నుంచి పూర్తిగా తప్పించారు. వారు కూడా గాయాలకు చికిత్స తీసుకుంటున్నారు. వారి స్థానంలో నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్ ఆడనున్నారు. టెస్టు స్క్వాడ్ లోకి ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కట్ ను కూడా తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది.

టీమిండియా స్క్వాడ్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్). విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, అభిమన్యు ఈశ్వరన్, నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్, జయదేవ్ ఉనద్కట్.

Fire In Bus : ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం.. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు, భయంతో దూకేసిన ప్రయాణికులు

ట్రెండింగ్ వార్తలు