Fire In Bus : ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం.. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు, భయంతో దూకేసిన ప్రయాణికులు

ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నడుస్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

Fire In Bus : ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం.. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు, భయంతో దూకేసిన ప్రయాణికులు

Fire In Bus : ఉత్తరప్రదేశ్ లోని బందాలో ఊహించని ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నడుస్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

అగ్నిప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 29మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా ప్రాణ భయంతో బస్సులోంచి దూకేశారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బస్సు ఇంజిన్ హీట్ ఎక్కడం వల్లే మంటలు చెలరేగి, అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. బస్సులో మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది.

Also Read..Shamshabad Airport Fire Accident : శంషాబాద్ ఎయిర్ పోర్టులో అగ్నిప్రమాదం, భయాందోళన చెందిన ప్రయాణికులు

ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. బస్సు లక్నోకు వెళ్తోంది. బస్సులో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. చూస్తుండగానే మంటలు చెలరేగాయి. బస్సు నిండా దట్టమైన పొగ కమ్మేసింది. అసలేం జరుగుతుందో డ్రైవర్‌కు ఏమీ అర్థం కాలేదు. వెంటనే స్పంగించిన స్థానికులు బస్సు అద్దాలను పగులగొట్టి అందులోని ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీశారు. ఆ వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఏమీ జరగలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Also Read..Fire Accident Six Dead : యూపీలో ఘోర అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనం

”ఆజాద్ నగర్ డిపో రోడ్‌వేస్ బస్సు.. 48 మంది ప్రయాణికులతో కాన్పూర్ నుండి లక్నోలోని చార్‌బాగ్‌కు వెళ్తోంది. బంత్రా సమీపంలోకి రాగానే బస్సులో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. కాసేపటికే మంటలు చెలరేగాయి. స్థానికుల సహకారంతో బస్సులోని ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. చాలా దూరం నుంచి బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు అద్దాలను పగులగొట్టి ప్రయాణికులందరినీ బయటకు తీశారు. బస్సు డ్రైవర్ కూడా గ్యాస్ సిలిండర్‌తో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు” అని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.