Rohit Sharma : చ‌రిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ‌.. టీ20ల్లో ఒకే ఒక్క‌డు

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ చ‌రిత్ర సృష్టించాడు.

Rohit Sharma : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ చ‌రిత్ర సృష్టించాడు. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 150 మ్యాచులు ఆడిన మొద‌టి ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఇండోర్ వేదిక‌గా ఆదివారం అఫ్గానిస్తాన్‌తో రెండో టీ20 మ్యాచ్ ద్వారా రోహిత్ ఈ రికార్డును అందుకున్నాడు. భార‌త్ కు చెందిన వారిలో రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలు మాత్ర‌మే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో వంద‌కు పైగా టీ20 మ్యాచులు ఆడారు. విరాట్ కోహ్లీ నేటి మ్యాచుతో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు 116 మ్యాచులు ఆడాడు.

అంతర్జాతీయ టీ20లలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లు వీరే..

రోహిత్‌ శర్మ (భార‌త్‌) – 150 మ్యాచులు
పాల్‌ స్టిర్లింగ్ (ఐర్లాండ్‌) – 134
జార్జ్‌ డాక్రెల్ (ఐర్లాండ్‌) – 128
షోయబ్‌ మాలిక్ (పాకిస్తాన్‌) – 124
మార్టిన్‌ గప్టిల్ (న్యూజిలాండ్‌) – 122
విరాట్ కోహ్లీ (భార‌త్‌) – 116

Mohammad Rizwan : టీ20ల్లో రిజ్వాన్ అరుదైన రికార్డు.. సిక్స‌ర్ల మోత‌..

2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇంగ్లాండ్‌తో జ‌రిగిన మ్యాచు ద్వారా రోహిత్ శ‌ర్మ టీమ్ఇండియా త‌రుపున టీ20ల్లో అరంగ్రేటం చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు అత‌డి కెరీర్‌లో 31.07 స‌గ‌టుతో 3853 ప‌రుగులు చేశాడు. 29 హాఫ్ సెంచ‌రీలు, నాలుగు సెంచ‌రీలు అత‌డి పేరు మీద ఉన్నాయి.

అత్య‌ధిక విజ‌యాల రికార్డు..

అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌లోనే రోహిత్ మ‌రో అందుకున్నాడు. మెన్స్ క్రికెట్‌లో అంత‌ర్జాతీయ టీ20ల్లో 100 విజ‌యాలు అందుకున్న మొద‌టి ఆట‌గాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. మొహాలీ వేదిక‌గా అఫ్గానిస్తాన్‌తో జ‌రిగిన మొద‌టి టీ20 మ్యాచులో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో విజ‌యం సాధించ‌డంతో రోహిత్ ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు.

అంతర్జాతీయ పురుషుల టీ20ల్లో అత్య‌ధిక మ్యాచులు గెలిచింది వీరే..

రోహిత్ శ‌ర్మ – 100* మ్యాచులు
షోయ‌బ్ మాలిక్ – 86
విరాట్ కోహ్లీ – 73
మ‌హ్మ‌ద్ హ‌ఫీజ్ – 70
మ‌హ్మ‌ద్ న‌బీ – 70

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ‌కు అవ‌మానం..! ముంబై ఇండియ‌న్స్ పై మండిప‌డుతున్న ఫ్యాన్స్‌..

ట్రెండింగ్ వార్తలు