Limited Overs Captain : విరాట్ కోహ్లీ కెప్టెన్సీ రోహిత్ శర్మకు.. టీ20 వరల్డ్ కప్ తర్వాతే!

టీమిండియాలో పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకునే అవకాశం కనిపిస్తోంది. కోహ్లీ స్థానంలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్య పగ్గాలను అందుకునే ఛాన్స్ కనిపిస్తోంది.

Rohit Sharma Set To Replace Virat Kohli As Limited Overs Captain After T20 World Cup (1)

Rohit Sharma Limited Overs Captain : భారత క్రికెట్ జట్టులో పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకునే అవకాశం కనిపిస్తోంది. కోహ్లీ స్థానంలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్య పగ్గాలను అందుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ కీలక మార్పు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ త‌ర్వాత కోహ్లీ తన కెప్టెన్సీని నుంచి తప్పుకునే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తన కెప్టెన్సీకి వీడ్కోలు పలికే విషయమై త్వరలో కోహ్లీ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటివరకూ అన్ని ఫార్మాట్ల‌కు కోహ్లీసే కెప్టెన్‌గా ఉన్నాడు. టీ20 వ‌రల్డ్‌క‌ప్ త‌ర్వాత కేవ‌లం టెస్టుల్లో మాత్రమే కెప్టెన్సీ బాధ్య‌త‌లు నిర్వర్తించాలని విరాట్ భావిస్తున్నాడట.. దీనికి సంబంధించి కోహ్లీ.. రోహిత్ సహా టీం మేనేజ్ మెంట్ తో కలిసి అనేకసార్లు చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది.
Rohit Sharma: రోహిత్ తొలి విదేశీ సెంచరీ.. కోహ్లీ రియాక్షన్ చూశారా..

ఐపీఎల్‌లో రోహిత్ శర్మకు తిరుగులేని బ్యాట్స్ మెన్.. తన సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు టైటిల్ గెలిచింది. అందుకే కనీసం టీ20ల్లోనైనా రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్సీకి వీడ్కోలు పలికి తన బ్యాటింగ్‌పై దృష్టి సారించాల‌ని విరాట్ భావిస్తున్నాడట.. అంతేకాదు.. కెప్టెన్సీ భారాన్ని త‌గ్గించుకోవాలని భావిస్తున్న కోహ్లి త్వరలో ఈ ప్రకటన చేసే అవకాశం ఉందని ఓ నివేదిక వెల్లడించింది. కోహ్లీ తన బ్యాటింగ్‌తో ఆల్ టైమ్ గొప్ప ఆటగాడిగా రికార్డులు నెలకొల్పాడు. అంతర్జాతీయ మ్యాచ్ ల్లో సెంచరీ సాధించి కోహ్లీకి దాదాపు మూడేళ్లు అవుతుంది. 2019లో బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టులో మ్యాచ్ సెంచరీ సాధించడమే చివరిది.

ఒకవేళ రోహిత్ వైట్ బాల్ కెప్టెన్ గా బాధ్యతలు చేపడితే.. విరాట్ భారత్ రెడ్ బాల్ కెప్టెన్సీలో (టీ20, వన్ డే బ్యాటింగ్)పై కొనసాగనున్నాడు. 32ఏళ్ల వయస్సున్న కోహ్లీ తన ఫిట్ నెస్ ఆధారంగా కనీసం ఐదు నుంచి ఆరేళ్లు ఆడనున్నట్టు నివేదిక తెలిపింది. మూడు ఫార్మాట్ల‌లో కెప్టెన్‌గా కోహ్లీ స‌క్సెస్ సాధించినా.. కనీసం ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెల‌వ‌లేద‌ు.
IPL 2021 : ఐపీఎల్ ఆడేందుకు దుబాయ్ చేరుకున్న సిరాజ్‌, కోహ్లి

విరాట్ కోహ్లి ఇప్ప‌టికే 95 వ‌న్డేల్లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టగా.. 65 విజ‌యాలు, 27 ఓట‌ములు ఉన్నాయి. కెప్టెన్‌గా విజయాలు సాధించిన వాటిలో 70.43శాతం కోహ్లీ రికార్డులే ఉన్నాయి. అత‌ని కెప్టెన్సీలో 45 టీ20ల్లో 27 గెలవగా.. 14 మ్యాచ్ ల్లో భారత్ పరాజయం పాలైంది. రోహిత్ శ‌ర్మ 10 వ‌న్డేల్లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టగా.. 8 విజ‌యాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే 19 టీ20ల్లో 15 విజ‌యాలు సాధించి రోహిత్ తనదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
Rohit Sharma: ఆ జాబితాలో 8వ వాడిగా నిలిచిన రోహిత్ శర్మ