India vs England : బెస్ట్ ఫీల్డింగ్ అవార్డు అందుకున్న టీమిండియా ఆటగాళ్లు.. వాళ్లెవరో ఈ వీడియోలో చూడండి

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ముగిసింది. 4-1తేడాతో టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది.

Team india

Team India : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ముగిసింది. 4-1తేడాతో టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది. ఐదో టెస్ట్ మ్యాచ్ ధర్మశాలలో జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ బ్యాటర్లు, బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. దీంతో 64 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం డ్రస్సింగ్ రూంలో టీమిండియా ప్లేయర్స్ సంబరాలు చేసుకున్నారు. మరోవైపు ముగ్గురు ఆటగాళ్లకు అవార్డులు దక్కాయి. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో ఉత్తమ ఫీల్డింగ్ చేసిన ప్లేయర్స్ ను ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ ఎంపిక చేశారు. వారికి బీసీసీఐ సెక్రటరీ జేషా అవార్డులు అందజేశారు.

Also Read : బీసీసీఐ టెస్ట్ క్రికెట్ ఇన్సెంటివ్ స్కీం ద్వారా ఒక్కో ప్లేయర్ సంపాదన ఎంత పెరగనుందో తెలుసా?

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో టీమిండియా ప్లేయర్స్ కృషిని దిలీప్ అభినందించారు. అయితే.. రెండో టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ను రనౌట్ చేసిన శ్రేయాస్ అయ్యర్ ను అభినందించారు. సిరీస్ సమయంలో షార్ట్ లీడ్ లో ఫీల్డింగ్ చేసినందుకు సర్ఫరాజ్ ఖాన్ ను కూడా అభినందించారు. మరో అరంగేట్రం ఆటగాడు ధృవ్ జురెల్ స్టంప్స్ వెనుక అద్భుతంగా రాణించాడని ఫీల్డింగ్ కోచ్ కోనియాడారు. అయితే, సిరీస్ మొత్తం మీద అద్భుత ఫీల్డింగ్ ప్రదర్శనతోపాటు, క్యాచ్ లు అందుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనింగ్ బ్యాటర్ శుభమాన్ గిల్ ను ఇంపాక్ట్ ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులకు ఎంపిక చేశారు.

Also Read : యూసుఫ్ పఠాన్ పొలిటికల్ ఇన్నింగ్స్.. కాంగ్రెస్ కంచుకోటలో పోటీ

ఈ అవార్డులను బీసీసీఐ కార్యదర్శి జే షా అందజేశారు. గిల్, రోహిత్ శర్మలు 10 ఇన్నింగ్స్ లలో ఆరు క్యాచ్ లు అందుకున్నారు. ధర్మశాల టెస్టులో శుభమాన్ గిల్ బెన్ డకెట్ క్యాచ్ పట్టాడు. మరోవైపు టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను ‘నిరంతర మద్దతు’ అవార్డుకు ఎంపిక చేసి జేషా చేతులమీదుగా అవార్డును అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది.

 

 

 

ట్రెండింగ్ వార్తలు