బీసీసీఐ టెస్ట్ క్రికెట్ ఇన్సెంటివ్ స్కీం ద్వారా ఒక్కో ప్లేయర్ సంపాదన ఎంత పెరగనుందో తెలుసా?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఉదాహరణగా తీసుకుంటే.. 2023-24 సీజన్ లో మొత్తం 10 టెస్టుల్లో రోహిత్ ఆడాడు.

బీసీసీఐ టెస్ట్ క్రికెట్ ఇన్సెంటివ్ స్కీం ద్వారా ఒక్కో ప్లేయర్ సంపాదన ఎంత పెరగనుందో తెలుసా?

Test Cricket Incentive Scheme

BCCI Test Cricket Scheme : టెస్టు క్రికెట్ ప్రాధాన్యతను పెంచేలా బీసీసీఐ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఇందులోభాగంగా టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీంను బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రారంభించారు. బీసీసీఐ కొత్త స్కీం ప్రకారం.. ఏడాదిలో క్రమంతప్పకుండా టెస్టులు ఆడితే.. ఇప్పుడు అందుకుంటున్న మొత్తం కంటే నాలుగింతల ఆదాయం అందుకోవచ్చు. ముఖ్యంగా బీసీసీఐ ఒక నిర్దిష్ట సీజన్ లో షెడ్యూల్ చేయబడిన టెస్ట్ మ్యాచ్ లలో 75శాతం, అంతకంటే ఎక్కువ మ్యాచ్ లలో ఆడే ప్లేయర్ కు మ్యాచ్ కు రూ. 45లక్షల చొప్పున ప్రోత్సాహక నగదు ఇస్తామని బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ ప్రకటించిన ఈ స్కీమ్ ను 2022 -23 సీజన్ నుంచే వర్తింపజేయడం విశేషం.

Also Read : BCCI : భార‌త‌ టెస్టు క్రికెట‌ర్ల పంట పండింది.. ఒక్కొ మ్యాచ్‌కు రూ.45 ల‌క్ష‌ల వ‌ర‌కు

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఉదాహరణగా తీసుకుంటే.. 2023-24 సీజన్ లో మొత్తం 10 టెస్టుల్లో రోహిత్ ఆడాడు. రోహిత్ శర్మ సాధారణంగా ఒక్కో టెస్ట్ మ్యాచ్ ఫీజు రూ. 15లక్షలు. అంటే.. పది మ్యాచ్ లకు రూ. 1.5కోట్లు అందుకుంటాడు. దీనికి ప్రస్తుతం బీసీసీఐ ప్రకటించిన ప్రోత్సాహం తోడైతే ఒక్కో మ్యాచ్ కు రూ. 45లక్షలు లభిస్తుంది.. అంటే పది మ్యాచ్ లకు రూ.4.50 కోట్లను రోహిత్ శర్మ అందుకునే అవకాశం ఉంటుంది. దీంతో టెస్టు క్రికెట్ ద్వారానే అతని సంపాదన ఆరు కోట్లు అవుతుంది. దానికితోడు రోహిత్ శర్మ ఒక సీజన్ కు రూ. 7కోట్లు వార్షిక రిటైనర్షిప్ ను కలిగి ఉన్నాడు. ఈ మొత్తాన్ని కలుపుకుంటే రోహిత్ శర్మ (వన్డే, టీ20 ఫార్మాట్ కాకుండా) ఆదాయం రూ. 13 కోట్లకు వెళ్తుంది. బీసీసీఐ తాజా స్కీం ప్రకారం.. రిజర్వ్ బెంచ్ కు పరిమితమైనా ఒక్కో మ్యాచ్ కు కనీసం రూ. 22.5లక్షలు వస్తాయి.

Also Read : WTC Points table : ఐదో టెస్టులో ఇంగ్లాండ్ పై విజ‌యం.. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌లో భార‌త అగ్ర‌స్థానం ప‌దిలం

ఒక ప్లేయర్ నిర్దిష్ట సీజన్ లో తొమ్మిది కంటే తక్కువ.. ఆరు టెస్ట్ మ్యాచ్ లే ఆడినట్లయితే.. సదరు ప్లేయర్ కు రూ. 30లక్షల అదనపు మ్యాచ్ ఫీజు ప్రోత్సాహకం ఉంటుంది. ఒక సీజన్ లో ఆరు టెస్టులు ఆడిన ప్లేయర్.. ప్రస్తుత మ్యాచ్ ఫీజుగా రూ. 90లక్షలు, ఆరు మ్యాచ్ లకు ప్రోత్సాహకం మొత్తం రూ. 1.8కోట్లు అందుకుంటాడు. దీంతో సదరు ప్లేయర్ కు మ్యాచ్ ఫీజు, ప్రోత్సాహం కలుపుకొని ఒక సీజన్ కు రూ. 2.70 కోట్లు లభిస్తాయి.