Rohit Sharma stops fans from chanting Mumbai Cha Raja at Bappas pandal
Rohit Sharma : టీమ్ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల ముంబైలోని వర్లీలో సందడి చేశాడు. గణపతి పూజల కోసం ఆయన ఓ మండపానికి వెళ్లారు. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఇక రోహిత్ శర్మ (Rohit Sharma) వినాయకుడికి పూజ చేస్తుండగా ముంబైకా రాజా రోహిత్ శర్మ అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే.. దీనిపై హిట్‌మ్యాన్ కాస్త అసహనం వ్యక్తం చేశాడు.
గణేశుడి మండపం వద్ద ఇలా చేయడం తగదని ఫ్యాన్స్‌ను వారించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Rohit stopped everyone to chant Mumbai Cha Raja in front of Bappa🥺
He is so down to earth, humble person. 🥹🤌 pic.twitter.com/gPKWyPg8Fy
— Shikha (@Shikha_003) September 5, 2025
ఇక పూజ అనంతరం ఆయన కారులో ఇంటికి బయలుదేరారు. ఫ్యాన్స్ ఆయన కారును చుట్టు ముట్టడంతో కారు సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చి చేపుతు ఊపుతూ ఫ్యాన్స్ కు అభివాదం చేశారు. మరోసారి అభిమానులు ముంబై కా రాజా అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారు అతి కష్టం మీద ముందుకు కదిలింది.
ODI World Cup 2025 : వరల్డ్ కప్ ఓపెనింగ్ కి పాకిస్తాన్ డుమ్మా..!
Rohit Sharma visited Worli Mumbai today for Ganpati Bappa’s darshan, where a huge crowd gathered around him.🥹❤️🔥 (@/Bunny_1531) pic.twitter.com/7sUAB0w77R
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) September 4, 2025
ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం..
ఐపీఎల్ ముగిసిన తరువాత నుంచి విశ్రాంతి తీసుకుంటున్న రోహిత్ శర్మ ప్రస్తుతం ఆసీస్‌తో వన్డే సిరీస్ పై దృష్టి పెడ్డాడు. ఇటీవలే బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఫిట్‌నెస్ పరీక్షలు పాసైయ్యారు. అక్టోబర్‌లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ మూడు వన్డేలు, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన హిట్‌మ్యాన్ ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే.