Rohit Sharma surpasses Adam Gilchrist, Sourav Ganguly in elite ODI list
Rohit Sharma : టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాళ్లలో మూడో స్థానానికి చేరుకున్నాడు. ఆసీస్‌తో రెండో వన్డే మ్యాచ్‌లో ( 73; 97 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించడం ద్వారా అతడు ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో అతడు దిగ్గజ ఆటగాడు గంగూలీని అధిగమించాడు.
గంగూలీ 308 వన్డేలు ఆడాడు. 297 ఇన్నింగ్స్‌ల్లో 40.95 సగటుతో 11,221 పరుగులు చేశాడు. ఇక రోహిత్ శర్మ (Rohit Sharma ) విషయానికి వస్తే 275 మ్యాచ్‌లు ఆడాడు. 267 ఇన్నింగ్స్‌ల్లో 48.69 సగటుతో 11,249 పరుగులు సాధించాడు. ఇక టీమ్ఇండియా తరుపున వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 463 వన్డే మ్యాచ్‌ల్లో 18426 పరుగులు సాధించాడు. ఇక రెండో స్థానంలో కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ 304 మ్యాచ్‌ల్లో 14181 పరుగులు సాధించాడు.
వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన టీమ్ఇండియా ఆటగాళ్లు వీరే..
* సచిన్ టెండూల్కర్ – 463 మ్యాచ్‌ల్లో 18426 పరుగులు
* విరాట్ కోహ్లీ – 304 మ్యాచ్‌ల్లో 14181 పరుగులు
* రోహిత్ శర్మ – 275 మ్యాచ్‌ల్లో 11249 పరుగులు
* సౌరవ్ గంగూలీ – 308 మ్యాచ్‌ల్లో 11221 పరుగులు
* రాహుల్ ద్రవిడ్ – 340 మ్యాచ్‌ల్లో 10768 పరుగులు
ఓపెనర్‌గా వన్డేల్లో అత్యధిక పరుగులు..
వన్డే క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అతడు ఆసీస్ దిగ్గజ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్, సౌరవ్ గంగూలీలను అధిగమించాడు. ఓపెనర్‌గా గంగూలీ 9146 పరుగులు చేయగా, గిల్ క్రిస్ట్ 9200 పరుగులు సాధించాడు.
తాజా మ్యాచ్‌తో కలిపి ఓపెనర్‌గా రోహిత్ శర్మ 9219 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో 15310 పరుగులతో సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తరువాత జయసూర్య, క్రిస్‌గేల్ ఉన్నారు.
Rohit Sharma : చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ఆసీస్ గడ్డపై ఏకైక భారత ఆటగాడు..
వన్డే క్రికెట్ చరిత్రలో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
* సచిన్ టెండూల్కర్ (భారత్)- 15310 పరుగులు
* సనత్ జయసూర్య (శ్రీలంక) – 12740 పరుగులు
* క్రిస్‌గేల్ (వెస్టిండీస్) – 10179 పరుగులు
* రోహిత్ శర్మ (భారత్) – 9219 పరుగులు
* ఆడమ్ గిల్ క్రిస్ట్ (ఆస్ట్రేలియా) – 9200 పరుగులు
* సౌరవ్ గంగూలీ (భారత్) – 9146 పరుగులు