Rohit Sharma Virat Kohli Retirement New But Uncertain Future Awaits Team India
Team India Future: టీమిండియా ఫ్యూచర్ పరిస్థితి ఏంటి?.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే చర్చ. క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ… T ట్వంటీల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ ఇద్దరి బాటలోనే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వెళ్లారు. తాను కూడా టీ ట్వంటీల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు. భవిష్యత్‌లో యంగ్ క్రికెటర్లకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే రిటైర్మెంట్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సమయంలోనే ఎన్నో ప్రశ్నలు క్రికెట్ అభిమానుల్లో తలెత్తుతున్నాయి. సీనియర్ల బాధ్యతలను ఎవరు భుజాన వేసుకుంటారు? కోహ్లీ, రోహిత్ స్థానాలను ఎవరు భర్తీ చేస్తారు? అన్నింటికన్నా ముఖ్యంగా ఇప్పుడు టీ ట్వంటీకి కెప్టెన్ ఎవరు అనే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
టీమిండియాలో టీ ట్వంటీలకు రోహిత్ శర్మ గుడ్‌బై చెప్పడంతో కెప్టెన్ ఎవరనే చర్చ జరుగుతోంది. రోహిత్ స్థానంలో.. ఆల్‌రౌండ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న హార్దిక్ పాండ్యాకే కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే కొన్ని ద్వైపాక్షిక సిరీస్‌లకు హార్దిక్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. కొన్ని సిరీస్‌లను కూడా గెలిపించాడు. ఇప్పుడు మరోసారి హార్దిక్ వైపే BCCI మెుగ్గుచూపే అవకాశం ఉంది. వరల్డ్ కప్‌లోనూ అంచనాలు అందుకోవడంతో హార్దిక్‌కు కెప్టెన్సీ ఇస్తారనే చర్చ నడుస్తోంది. మరోవైపు IPLలోనూ కెప్టెన్‌గా చేసిన అనుభవం హార్దిక్కు ఉంది.
పంత్ ఫ్యూచర్ స్టార్!
హార్దిక్ కాకుండా జట్టులో కెప్టెన్ అయ్యే అవకాశాలు మరికొందరికి కూడా ఉన్నాయి. రిషబ్ పంత్‌కు సారథ్య బాధ్యతలను అప్పగించవచ్చు. టీమిండియాకు పంత్ ఫ్యూచర్ స్టార్ అనే అభిప్రాయాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే అతడి ఆటతీరు ఉంది. యాక్సిడెంట్ గాయాల నుంచి కోలుకున్న పంత్… IPLలో ఇరగదీశాడు. వెంటనే టీ ట్వంటీ వరల్డ్ కప్ జట్టులోనూ చోటు సంపాదించాడు. కొన్ని మ్యాచుల్లో తనదైన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ లెక్కన పంత్‌ను కూడా కెప్టెన్‌గా చేసే అవకాశాలు లేకపోలేదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కెప్టెన్ రేసులో KL రాహుల్ కూడా ఉంటాడు. అయితే.. ప్రస్తుతం సరైన ఫామ్‌లో లేకపోవడంతో అతడికి చోటు దక్కలేదు. భవిష్యత్‌లో రాణించగలిగితే రాహుల్‌కు కూడా అవకాశాలు ఉంటాయి. సూపర్ బౌలింగ్‌తో అదరగొడుతున్న బుమ్రాకు కూడా కెప్టెన్సీ అప్పగించవచ్చనే టాక్ వినిపిస్తోంది.
Also Read: టీమిండియాకు రూ.125 కోట్లు.. భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ
ఇక కోహ్లీ, రోహిత్ స్థానాలను ఎవరు భర్తీ చేస్తారనేది టీమిండియాకు కీలకం. ఓపెనర్‌గా రోహిత్ స్థానంలో యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, ఇషాన్ కిషాన్, పృథ్వీ షాలాంటి వాళ్లు ఉన్నారు. ఇందులో రోహిత్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో చూడాలి. అయితే.. ఇప్పుడు కోహ్లీ ప్లేస్‌లో ఎవరు ఉంటారనేది కీలకంగా మారింది. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి వాళ్లు ఏ స్థానంలోనైనా ఆడగలరు. మరోవైపు రిషబ్ పంత్ వరల్డ్ కప్‌లో ఫస్ట్ డౌన్ బ్యాటింగ్‌కు దిగాడు. వీరిలో ఒకరికి అవకాశం దక్కొచ్చు.
Also Read: ప్రపంచకప్ గెలిచిన తరువాత రోహిత్ శర్మ వ్యాఖ్యలు.. అసలైన అర్హుడు అతడే..
మిడిలార్డర్‌లో రాణించేందుకు టీమిండియాలో యంగ్ క్రికెటర్స్ చాలామంది ఉన్నారు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, శివమ్ దూబే, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లు ఎంతోమంది తమదైన ఆటతో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు వీళ్లంతా టీమిండియా ఫ్యూచర్ స్టార్స్ గా ఎదిగే అవకాశం వచ్చింది.