Virat Kohli: కోహ్లీ అవుట్ అవగానే మారిపోయిన రోహిత్ రియాక్షన్

విరాట్ కోహ్లీకి దాదాపు 2019 నవంబరు నుంచి ఒక్క టెస్టు సెంచరీ కూడా లేదు. చూస్తుంటే టీమిండియా మాజీ కెప్టెన్ ఔట్ ఆఫ్ ఫామ్ గానే కనిపిస్తున్నాడు. ఇక మొహాలీ స్టేడియం వేదికగా ఆడిన మ్యాచ్..

Virat Kohli: కోహ్లీ అవుట్ అవగానే మారిపోయిన రోహిత్ రియాక్షన్

Virat Kohli 10tv

Updated On : March 4, 2022 / 9:05 PM IST

Virat Kohli: విరాట్ కోహ్లీకి దాదాపు 2019 నవంబరు నుంచి ఒక్క టెస్టు సెంచరీ కూడా లేదు. చూస్తుంటే టీమిండియా మాజీ కెప్టెన్ ఔట్ ఆఫ్ ఫామ్ గానే కనిపిస్తున్నాడు. ఇక మొహాలీ స్టేడియం వేదికగా ఆడిన మ్యాచ్ లో వందో టెస్టులో సెంచరీ స్కోరు ఊహించిన అభిమానులను నిరాశపరిచాడు.

నిజానికి హనుమ విహారీతో పాటు స్పిన్నర్లు విసిరిన బంతులపై విరుచుకుపడి 40స్కోరును దాటించేశాడు. ఆ తర్వాత 45పరుగులకు ఎంబుల్దేనియా బౌలింగ్ లో అవుట్ అవడం కాస్త నిరుత్సాహానికి గురిచేసింది. బ్యాక్‌ఫూట్‌కు వెళ్లి బంతిని ఆడాలని ప్రయత్నించేలోగా బంతి ఆఫ్ స్టంప్ వైపుగా తిరిగిపోయింది.

ఆ షార్ప్ టర్న్ చూసి కోహ్లీ షాక్ అయ్యాడు. శ్రీలంక ప్లేయర్లు సెలబ్రేట్ చేసుకుంటుండగా.. రీప్లేలో రోహిత్ శర్మ రియాక్షన్ కనిపించింది. ఒక్కసారిగా రెండు చేతులు పైకెత్తి తలపట్టుకుని అక్కడ్నుంచి కదిలి పక్కకువెళ్లిపోయాడు. కాకపోతే రోహిత్ శర్మ పక్కనే నిల్చొన్న బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ మాత్రం ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోవడం గమనార్హం.

Read Also: విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై గంగూలీ రియాక్షన్!

కోహ్లీ కంటే ముందే రోహిత్ 29పరుగుల వ్యక్తిగత స్కోరుతో అవుట్ అయ్యాడు. వందో టెస్టులో భారీ స్కోరు నమోదు చేస్తాడని భావించిన కోహ్లీ 45పరుగులతో సరిపెట్టుకున్నాడు. ఇన్నింగ్స్ మొత్తంలో రిషబ్ పంత్ 96పరుగులతో దుమ్ముదులిపాడు. జడేజా, అశ్విన్ లు క్రీజులో ఉన్నారు.