Rohit surpasses Ganguly to become India second most successful captain in ICC events
Rohit Sharma – Sourav Ganguly : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈవెంట్లలో టీమ్ఇండియాకు అత్యధిక విజయాలు అందించిన రెండో భారత కెప్టెన్‌గా నిలిచాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును బ్రేక్ చేశాడు. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించడంతో ఈ ఘనతను రోహిత్ అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో అమెరికా మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. అమెరికా బ్యాటర్లలో నితీశ్ కుమార్ (27), స్టీవెన్ టేలర్ (24) లు ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్య రెండు వికెట్లు, అక్షర్ పటేల్ ఓ వికెట్ తీశాడు.
Pakistan : వరుణుడిని వేడుకుంటున్న పాకిస్తాన్ ఆటగాళ్లు.. సాయం చేసేనా..?
అనంతరం సూర్యకుమార్ యాదవ్ (50 నాటౌట్; 49 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా శివమ్ దూబె(31 నాటౌట్; 35 బంతుల్లో 1 ఫోర్, 1సిక్స్) రాణించడంతో లక్ష్యాన్ని భారత్ 18.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ(3), స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి (0) లు విఫలం కాగా.. రిషబ్ పంత్ (18) ఫర్వాలేదనిపించాడు.
కాగా.. ఐసీసీ ఈవెంట్లలో భారత జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇది 17వ విజయం. రోహిత్ ఇప్పటి వరకు 20 మ్యాచుల్లో భారత్‌కు నాయకత్వం వహించాడు. ఈ క్రమంలో గంగూలీ రికార్డును బ్రేక్ చేశాడు. దాదా నాయకత్వంలో భారత్ 22 మ్యాచులు ఆడగా 16 మ్యాచుల్లో గెలిచింది. ఇక ఐసీసీ ఈవెంట్లలో అత్యధిక విజయాలు అందించిన రికార్డు మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉంది. ధోని 58 మ్యాచుల్లో 41 విజయాలను అందించాడు.
Shardul Thakur : ఆస్పత్రి బెడ్ పై టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్.. కంగారు పడుతున్న అభిమానులు..!
ఐసీసీ టోర్నమెంట్‌లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్లు వీరే..
ఎంఎస్ ధోని – 41 (58 మ్యాచుల్లో)
రోహిత్ శర్మ – 17 (20 మ్యాచుల్లో)
సౌరవ్ గంగూలీ – 16 (22 మ్యాచుల్లో)
విరాట్ కోహ్లీ – 13 (19 మ్యాచుల్లో)
కపిల్ దేవ్ – 11 (15మ్యాచుల్లో)
మహ్మద్ అజారుద్దీన్ – 11 (25 మ్యాచుల్లో)