Pakistan : వరుణుడిని వేడుకుంటున్న పాకిస్తాన్ ఆటగాళ్లు.. సాయం చేసేనా..?
టీ20 ప్రపంచకప్2024లో పాకిస్తాన్‌కు ఏదీ కలిసి రావడం లేదు

Pakistan Super 8 chances bleak amid rain threat in Florida
టీ20 ప్రపంచకప్2024లో పాకిస్తాన్‌కు ఏదీ కలిసి రావడం లేదు. అమెరికా, భారత్ చేతిలో ఓడిన ఆ జట్టు సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. కాగా.. కెనడా పై విజయం సాధించి పొట్టి ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది. గ్రూపు ఏలో ఉన్న పాకిస్తాన్ తన చివరి లీగు మ్యాచ్‌ను ఐర్లాండ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం పాకిస్తాన్‌కు ఎంతో కీలకం. అయితే.. ఈ మ్యాచ్‌కు వరుణుడు అటంకం కలిగించే అవకాశం ఉంది.
ఆదివారం ప్లోరిడా వేదికగా పాకిస్తాన్, ఐర్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు ఒక్కొ పాయింట్ వస్తుంది. అదే జరిగితే పాకిస్తాన్ పొట్టి ప్రపంచకప్ నుంచి నిష్ర్కమిస్తుంది.
Shardul Thakur : ఆస్పత్రి బెడ్ పై టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్.. కంగారు పడుతున్న అభిమానులు..!
ఆడిన రెండు మ్యాచుల్లో గెలిచిన భారత్, అమెరికా జట్లు నాలుగేసి పాయింట్లతో పాయింట్ల పట్టికలో మొదటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నాయి. వర్షం వల్ల ఐర్లాండ్ మ్యాచ్ రద్దు అయితే అప్పుడు ఒక్క పాయింట్ కలుకుంటే మూడు పాయింట్లే ఉంటాయి. దీంతో అమెరికా, భారత్ లు తరువాతి దశకు చేరుకుంటాయి.
వర్షం పడకుండా ఉంటే..?
న్యూయార్క్ వేదికగా ప్రస్తుతం భారత్, అమెరికా జట్లు తలపడుతున్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే నేరుగా సూపర్ 8కి చేరుకుంటుంది. ఒకవేళ అమెరికా సంచలన విజయం సాధిస్తే ఆ జట్టు సూపర్ 8కి వెలుతుంది.
Cheating : ఖతార్ తొండాట.. రిఫరీ సహకారం.. భారత్‌కు తీవ్ర అన్యాయం.. వీడియో
భారత్ గనుక అమెరికా చేతిలో ఓడిపోయినా తమ ఆఖరి లీగు మ్యాచ్‌లో కెనడాతో ఆడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిచినా తరువాతి దశకు వెలుతుంది. ఒకవేళ పాకిస్తాన్ జట్టు సూపర్ 8కి చేరాలంటే.. అమెరికా తన చివరి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడిపోవాలి. అదే సమయంలో పాకిస్తాన్ తన ఆఖరి లీగు మ్యాచ్‌లో ఘన విజయం సాధించాలి. అప్పుడు అమెరికా, పాకిస్తాన్ జట్ల పాయింట్లు సమానంగా ఉంటాయి. మెరుగైన నెట్ రన్‌రేటు కలిగిన జట్టు సూపర్ 8కి వెలుతుంది.