Shardul Thakur : ఆస్పత్రి బెడ్ పై టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్.. కంగారు పడుతున్న అభిమానులు..!
భారత స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ మాత్రం ఆస్పత్రి బెడ్ పై ఉన్నాడు.

Shardul Thakur undergoes successful ankle surgery
Shardul Thakur ankle surgery : టీమ్ఇండియా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో బిజీగా ఉంది. అయితే.. భారత స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ మాత్రం ఆస్పత్రి బెడ్ పై ఉన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అభిమానులు కంగారు పడుతున్నారు. అతడి ఏమైందని కామెంట్లు పెడుతున్నారు.
కాగా.. శార్ఠూల్ గత కొంతకాలంగా చీల మండల గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ‘సర్జరీ సక్సెస్ అయింది. త్వరలోనే మైదానంలో కలుసుకుందాం. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.’ అని చెబుతూ ఆస్పత్రి బెడ్ పై కాలికి కట్టుతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు శార్ఠూల్ ఠాకూర్. దీన్ని చూసిన అభిమానులు అతడు త్వరగా కోలుకోని మైదానంలో అడుగుపెట్టాలని భావిస్తున్నారు.
USA vs IND : టీమ్ఇండియాకు అమెరికా స్టార్ ప్లేయర్ వార్నింగ్.. ప్రత్యర్థి ఎవరైనా..
టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనాలు ప్రకారం శార్దూల్ ఠాకూర్ గత కొంతకాలంగా చీలమండల గాయంతో బాధపడుతున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు ఈ నొప్పితోనే 17వ సీజన్‌లో బరిలోకి దిగాడు. ఆ సమయంలో నొప్పిని తట్టుకునేలా ఇంజెక్షన్లు తీసుకున్నాడట. అయితే.. దాని వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. మహ్మద్ షమీకి శస్త్రచికిత్స చేసిన డాక్టర్ వద్దే ఠాకూర్ సైతం ఆపరేషన్ చేయించుకున్నాడని మూలం పేర్కొంది.
కాగా.. ఐపీఎల్ 17వ సీజన్‌లో శార్దూల్ పెద్దగా రాణించలేదు. 9 మ్యాచుల్లో 5 వికెట్లు మాత్రమే తీశాడు.
Sri Lanka : వానొచ్చింది.. శ్రీలంక ఔటైంది..?
View this post on Instagram