Unlucky Dismissal : క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఇలా ఔట్ కావ‌డాన్ని ఎప్పుడూ చూసి ఉండ‌రు..! బ్యాటర్ ద‌రిద్రం మామూలుగా లేదుగా..

క్రికెట్‌లో అప్పుడప్పుడు కొన్ని ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటుంటాయి.

Ruth Johnston Suffers Heartbreak Most Unlucky Dismissal Ever In WBBL History

క్రికెట్‌లో అప్పుడప్పుడు కొన్ని ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటుంటాయి. అలాంటి ఓ ఘ‌ట‌న ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న మ‌హిళ‌ల బిగ్‌బాష్ లీగ్‌లో చోటు చేసుకుంది. ఓ బ్యాట‌ర్ ఔటైన విధానానికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇలాంటి ఔట్‌ను క్రికెట్ చ‌రిత్ర‌లోనే దాదాపుగా ఎవ్వ‌రూ చూసి ఉండ‌రు అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

సిడ్నీ వేదిక‌గా బుధ‌వారం సిడ్నీ థండర్ ఉమెన్, హోబర్ట్ హరికేన్స్ ఉమెన్ జ‌ట్ల మ‌ధ్య నాకౌట్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ ఉమెన్ జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. హోబ‌ర్ట్ హ‌రికేన్స్ జ‌ట్టు ఇన్నింగ్స్ మూడో ఓవ‌ర్‌లో ఇది చోటు చేసుకుంది. ఈ ఓవ‌ర్ ను సిడ్నీ థండ‌ర్ బౌల‌ర్ షబ్నిమ్ ఇస్మాయిల్ వేసింది. నాలుగో బంతిని షార్ట్ బాల్ గా వేయ‌గా హోబ‌ర్ట్ హరికేన్స్ బ్యాట‌ర్ రూత్ జాన్స్టన్ షాట్ ఆడింది. అయితే.. బాల్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది.

ICC test Rankings : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అద‌ర‌గొట్టిన భార‌త ఆట‌గాళ్లు.. బుమ్రా ఫ‌స్టు, య‌శ‌స్వి సెకండ్‌, కోహ్లీ..

బంతి ఎక్క‌డికి వెళ్లిందో గ‌మ‌నించని రూత్ ప‌రుగు ప్రారంభించింది. ఇంత‌లో బౌల‌ర్ ఇస్మాయిల్ క్యాచ్ అందుకునేందుకు స్టంప్స్ వైపు పరుగెత్తింది. బౌల‌ర్ రావ‌డాన్ని చూసిన రూత్ ఆగింది. బాల్‌ను గ‌మ‌నించి వెన‌క్కి వెళ్లే ప్ర‌య‌త్నం చేసింది. అయితే.. రూత్ కంటే ముందు బంతి నేల‌ను తాకి బౌన్స్ అయి వికెట్లు తాక‌డంతో బెయిల్స్ కింద‌ప‌డ్డాయి.

దీంతో 5 ప‌రుగులు మాత్ర‌మే చేసిన రూత్‌.. ఊహించిన విధంగా రూత్ పెవిలియ‌న్‌కు చేరుకుంది. ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో హోబ‌ర్ట్ హ‌రికేన్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 126 ప‌రుగులు చేసింది. హోబ‌ర్ట్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ ఎలిస్ విల్లని(53 నాటౌట్‌) హాఫ్ సెంచ‌రీతో రాణించింది. సిడ్నీ బౌల‌ర్ల‌లో చమరి అతపట్టు,తానేలే పెషెల్ లు చెరో వికెట్లు తీశారు.

Urvil Patel : ఐపీఎల్ వేలంలో అమ్ముడు పోలేదు.. క‌ట్ చేస్తే.. టీ20ల్లో ఫాస్టెస్ట్ చేసిన భార‌త ఆట‌గాడిగా రికార్డు.. ఎవ‌రీ ఉర్విల్ ప‌టేల్ ?

అనంత‌రం 127 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంలో బ‌రిలోకి దిగిన సిడ్నీ థండర్ ఉమెన్ ఆరు ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి 36 ప‌రుగులు చేసింది. ఫోబ్ లిచ్ఫీల్డ్ (0), చమరి అతపట్టు (16) లు క్రీజులో ఉన్నారు.