Urvil Patel : ఐపీఎల్ వేలంలో అమ్ముడు పోలేదు.. క‌ట్ చేస్తే.. టీ20ల్లో ఫాస్టెస్ట్ చేసిన భార‌త ఆట‌గాడిగా రికార్డు.. ఎవ‌రీ ఉర్విల్ ప‌టేల్ ?

గుజరాత్‌ ఆటగాడు ఉర్విల్‌ పటేల్ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Urvil Patel : ఐపీఎల్ వేలంలో అమ్ముడు పోలేదు.. క‌ట్ చేస్తే.. టీ20ల్లో ఫాస్టెస్ట్ చేసిన భార‌త ఆట‌గాడిగా రికార్డు.. ఎవ‌రీ ఉర్విల్ ప‌టేల్ ?

Urvil Patel smashes Indias fastest T20 century after getting unsold in IPL auction 2025

Updated On : November 27, 2024 / 1:07 PM IST

గుజరాత్‌ ఆటగాడు ఉర్విల్‌ పటేల్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. టీ20ల్లో భార‌త్ త‌రుపున అత్యంత వేగ‌వంత‌మైన సెంచ‌రీ చేసిన ఆట‌గాడిగా నిలిచాడు. స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అత‌డు ఈ ఘ‌న‌త సాధించాడు. త్రిపుర‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అత‌డు కేవ‌లం 28 బంతుల్లోనే శ‌త‌కాన్ని అందుకున్నాడు. ఈ క్ర‌మంలో టీమ్ఇండియా ఆట‌గాడు రిష‌బ్ పంత్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. 2018లో ఢిల్లీ త‌రుపున రిష‌బ్ పంత్ హిమాచల్‌ప్ర‌దేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 32 బంతుల్లో సెంచ‌రీ చేశాడు.

ఒక ఓవ‌రాల్‌గా చూసుకుంటే ప్ర‌పంచ క్రికెట్‌లో ఈ ఘ‌న‌త సాధించిన రెండో ఆట‌గాడిగా రికార్డుకు ఎక్కాడు. ఎస్టోనియా ఆట‌గాడు సాహిల్ చౌహాన్ 2024లో సైప్ర‌స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 27 బంతుల్లోనే శ‌త‌కాన్ని అందుకున్నాడు.

PAK vs ZIM : అరంగ్రేట మ్యాచ్‌లో పాక్ బౌల‌ర్ అరుదైన ఘ‌న‌త‌..

టీ20 క్రికెట్‌లో వేగ‌వంత‌మైన సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్లు..

సాహిల్ చౌహాన్ – 27 బంతుల్లో – 2024లో ఎస్టోనియా vs సైప్రస్ మ్యాచ్‌లో
ఉర్విల్ ప‌టేల్ – 28 బంతుల్లో – 2024లో గుజరాత్ vs త్రిపుర మ్యాచ్‌లో
క్రిస్ గేల్ – 30 బంతుల్లో – 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs పూణే వారియర్స్ మ్యాచ్‌లో
రిషబ్ పంత్ – 32 బంతుల్లో – 2018లో ఢిల్లీ vs హిమాచల్ ప్రదేశ్ మ్యాచ్‌లో
లుబ్బేలో – 33 బంతుల్లో – 2018లో నార్త్ వెస్ట్ vs లింపోపో మ్యాచ్‌లో
జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ – 33 బంతుల్లో – 2024లో నమీబియా vs నేపాల్ మ్యాచ్‌లో

ఉర్విల్ ప‌టేల్ విధ్వంస‌క‌ర శ‌త‌కంతో త్రిపుర నిర్దేశించిన ల‌క్ష్యాన్ని గుజ‌రాత్ 10.2 ఓవ‌ర్ల‌లోనే అందుకుంది. ఉర్విల్ ప‌టేల్ ఈ మ్యాచ్‌లో 35 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 12 సిక్స‌ర్ల సాయంతో 113 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు.

IND vs AUS : గెలుపు జోష్‌లో ఉన్న భార‌త్ కు మ‌రో షాక్‌.. రెండో టెస్టుకు స్టార్ ప్లేయ‌ర్ దూరం!

మెగా వేలంలో అమ్ముడుపోలేదు..

కాగా.. టీ20ల్లో వేగ‌వంత‌మైన సెంచ‌రీ చేసిన ఉర్విల్ ప‌టేల్ ఐపీఎల్ మెగా వేలం 2025లో అమ్ముడుపోలేదు. రూ.30ల‌క్ష‌ల క‌నీస ధ‌ర‌తో వేలంలో అడుగుపెట్టిన అత‌డిని ఏ ఫ్రాంచైజీ కూడా తీసుకోలేదు. ఐపీఎల్ 2023లో గుజ‌రాట్ టైటాన్స్ ఈ ఆట‌గాడిని రూ.20ల‌క్ష‌ల‌కు తీసుకుంది. అయితే.. ఒక్క మ్యాచ్ ఆడే అవ‌కాశం రాలేదు. మెగా వేలానికి ముందు అత‌డిని ఫ్రాంచైజీ విడిచిపెట్టింది. అయితే.. ఈసెంచ‌రీ ఏదో ఓ రెండు రోజులు ముందు చేసి ఉంటే వేలంలో ఫ్రాంఛైజీలు కోట్లు కుమ్మ‌రించేవ‌ని నెటిజ‌న్లు అంటున్నారు.

ఉర్విల్ పటేల్ ఎవరు?
బరోడాలోని మెహసానాకు చెందిన ఉర్విల్ 2018లో రాజ్‌కోట్‌లో ముంబైతో జరిగిన టీ20లో బరోడా తరఫున అరంగేట్రం చేశాడు. అదే సంవత్సరంలో అతను లిస్ట్ A క్రికెట్‌లో కూడా అరంగ్రేటం చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 44 టీ20 మ్యాచులు ఆడిన ఉర్విల్ ప‌టేల్ 23.52 సగటు, 164.11 స్ట్రైక్-రేట్ తో 988 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి.