IND vs AUS : గెలుపు జోష్‌లో ఉన్న భారత్ కు మరో షాక్.. రెండో టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ శుభారంభం చేసింది.

Shubman Gill Out Of 2nd test against Australia Report
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ శుభారంభం చేసింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పై భారత్ ఘన విజయాన్ని సాధించింది. ఫలితంగా 5 మ్యాచుల టెస్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఇక ఇరు జట్ల మధ్య అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ డే అండ్ నైట్ (పింక్‌బాల్) టెస్టుకు ముందు ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో భారత్ తలపడనుంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ కాన్‌బెర్రా వేదికగా శనివారం నుంచి ఆరంభం కానుంది.
కాగా.. తొలి టెస్టుకు ముందు వాకా స్టేడియంలో జరిగిన ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమ్ఇండియా స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు. అతడి బొటన వేలికి గాయమైంది. దీంతో అతడు తొలి టెస్టు మ్యాచ్‌కు దూరం అయ్యాడు. అయితే.. ఇప్పుడు అతడు రెండో టెస్టులోనూ ఆడడం అనుమానంగా మారిందని వార్తలు వస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఓ నివేదిక ప్రకారం ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో గిల్ పాల్గొనడం లేదు. దీంతో అతడు అడిలైడ్‌లో ఆడడం పై అనిశ్చితి ఉందని తెలిపింది.
Rahul Dravid : 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని కొనుగోలు చేయడం పై తొలిసారి స్పందించిన రాహుల్ ద్రవిడ్
గిల్ గాయాన్ని పరిశీలించిన వైద్యులు అతడికి 10 నుంచి 14 రోజులు విశ్రాంతి అవసరం అని సూచించినట్లు తెలిపింది. దీంతో అతడు వారంతంలో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడడు. అతడి గాయం పూర్తిగా నయం అయ్య వేరకు వేచి చూడాలని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తోంది. సుదీర్ఘ సిరీస్ నేపథ్యంలో ఎలాంటి రిస్క్ చేయదలుచుకోలేదు. ఈ క్రమంలో రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు గిల్ కోలుకున్న దాన్ని బట్టి ఆడించాలా వద్దా అనే నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇక పేసర్ షమీని ఆస్ట్రేలియా పంపించాలా వద్దా అన్న దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని నివేదిక తెలిపింది. ఆసీస్ టూర్‌కు ఎంపికైన ఫాస్ట్ బౌలర్లు, పెర్త్ లో జరిగిన తొలి టెస్టులో అద్భుతంగా రాణించారు. అని పేర్కొంది. దేవదత్ పడిక్కల్ స్థానంలో కెప్టెన్ రోహిత్ శర్మ రెండో టెస్టు మ్యాచ్‌లో బరిలోకి దిగడం ఖాయమని తెలిపింది.
IND vs AUS : గెలుపు జోష్‌లో ఉన్న టీమ్ఇండియాకు షాక్.. స్వదేశానికి వస్తున్న గౌతమ్ గంభీర్!