Rahul Dravid : 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని కొనుగోలు చేయడం పై తొలిసారి స్పందించిన రాహుల్ ద్రవిడ్
ఐపీఎల్ వేలంలో అమ్ముడైన అత్యంత పిన్న వయస్కుడిగా పదమూడేళ్ల వైభవ్ సూర్యవంశీ నిలిచాడు.

Rahul Dravid reveals why RR buy 13 year old vaibhav suryavanshi
ఐపీఎల్ వేలంలో అమ్ముడైన అత్యంత పిన్న వయస్కుడిగా పదమూడేళ్ల వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. మెగా వేలంలో అతడిని రాజస్థాన్ రాయల్స్ రూ.1.10 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. దీంతో క్రికెట్ ప్రపంచంలో వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగిపోతుంది. ఈ 13 ఏళ్ల కుర్రాడిని తీసుకోవడానికి గల కారణాన్ని రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించారు.
ఐపీఎల్ టీమ్ తమ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో రాహుల్ ద్రవిడ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్ఆర్ నిర్వహించిన సెలక్షన్స్ ట్రయల్స్‌కు అతడు వచ్చాడని, మంచి ప్రతిభ చూపాడని అన్నారు. అతడి ఆట పట్ల తాము సంతోషంగా ఉన్నామని అందుకనే అతడిని తీసుకున్నట్లు చెప్పాడు. అతడిలో ప్రతిభ ఉందని, అతడు ఎదగడానికి ఇది మంచి వాతావరణం అని తాము అనుకుంటున్నట్లు చెప్పాడు.
వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం వైభవ్ అండర్-19 ఆసియా కప్ కోసం దుబాయ్‌లో ఉన్నాడని అన్నారు. వేలం కంటే ముందు నాగ్‌పూర్ ఆర్ఆర్ నిర్వహించిన ట్రయల్స్‌లో సూర్యవంశీ పాల్గొన్నట్లుగా చెప్పాడు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఒకే ఓవర్‌లో 17 పరుగులు చేయాలని అన్నప్పుడు వైభవ్ మూడు సిక్సర్లు బాదాడు. మొత్తంగా ట్రయల్స్‌లో ఎనిమిది సిక్సర్లు, నాలుగు ఫోర్లు కొట్టినట్లు సంజీవ్ తెలిపాడు.
వైభవ్ సూర్య వంశీ వయస్సు 13 ఏళ్లు కాదని.. 15 ఏళ్లు అని వస్తున్న ఆరోపణలను సంజీవ్ కొట్టి పారేశాడు. అతడి వయస్సు 13 ఏళ్లు అని చెప్పాడు. ఎనిమిదిన్నర వయసులో ఎనిమిదిన్నర సంవత్సరాలు ఉన్నప్పుడు తొలిసారి బీసీసీఐ ఎముక పరీక్షకు హాజరు అయ్యాడని అన్నారు. కావాలంటే ఇప్పుడు ఎముక పరీక్ష చేయించుకోవచ్చునని తెలిపాడు.
Rishabh Pant : ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్ పంత్ చివరి ‘వీడ్కోలు’ సందేశం.. ‘ఈ తొమ్మిదేళ్ల ప్రయాణం..’
రూ.30లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ కోసం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడ్డాయి. చివరికి ఢిల్లీ రేసు నుంచి తప్పుకోగా ఆర్ఆర్ రూ.1.10 కోట్లు పెట్టి అతడిని దక్కించుకుంది.
“Rajasthan Royals will be a good environment for Vaibhav Suryavanshi” 🩷
Head Coach Rahul Dravid speaks about the youngest Royal and the look of the #RR squad post the #TATAIPLAuction 👌👌#TATAIPL | @rajasthanroyals pic.twitter.com/GuCNpWvgsD
— IndianPremierLeague (@IPL) November 26, 2024