ICC test Rankings : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన భారత ఆటగాళ్లు.. బుమ్రా ఫస్టు, యశస్వి సెకండ్, కోహ్లీ..
పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది.

ICC test Rankings Bumrah retains number one spot Jaiswal moves to number 2
పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. అటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఈ క్రమంలో ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు దుమ్ము లేపారు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మళ్లీ తన అగ్రస్థానానికి చేరుకున్నాడు.
పెర్త్ టెస్టుకు ముందు మూడో ర్యాంకులో ఉన్న అతడు ఆసీస్ పై అద్భుత ప్రదర్శన చేసి రెండు స్థానాలు ఎగబాకి తొలి స్థానానికి చేరుకున్నాడు. ఇక రెండో స్థానంలో దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ రెండో స్థానంలో ఉండగా జోష్ హేజిల్‌వుడ్, రవిచంద్రన్ అశ్విన్ లు వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్..
1. జస్‌ప్రీత్ బుమ్రా (భారత్) – 883 రేటింగ్ పాయింట్లు
2. కగిసో రబాడ (దక్షిణాఫ్రికా) – 872 రేటింగ్ పాయింట్లు
3. జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) – 860 రేటింగ్ పాయింట్లు
4. రవిచంద్రన్ అశ్విన్ (భారత్) – 807 రేటింగ్ పాయింట్లు
5. ప్రభాస్ జయసూర్య (శ్రీలంక) – 801 రేటింగ్ పాయింట్లు
PAK vs ZIM : అరంగ్రేట మ్యాచ్‌లో పాక్ బౌలర్ అరుదైన ఘనత..
ఇక బ్యాటింగ్ విభాగం విషయానికి వస్తే.. ఆసీస్ పై శతకాలతో చెలరేగిన యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీలు తమ స్థానాలను మెరుగుపరచుకున్నారు. యశస్వి రెండు స్థానాలు మెరుగుపరచుకుని రెండో ర్యాంక్‌కు చేరుకోగా కోహ్లీ ఏకంగా 9 స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్‌లో నిలిచాడు. ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జోరూట్ అగ్రస్థానంలో ఉన్నాడు. రిషబ్ పంత్ ఆరులో కొనసాగుతున్నాడు.
ఐసీసీ టెస్టు బ్యాటర్లు ర్యాంకింగ్స్..
1. జో రూట్ – 903 రేటింగ్ పాయింట్లు
2. యశస్వి జైస్వాల్ – 825 రేటింగ్ పాయింట్లు
3. కేన్ విలియమ్సన్ – 804 రేటింగ్ పాయింట్లు
4. హ్యారీ బ్రూక్ – 778 రేటింగ్ పాయింట్లు
5. డారిల్ మిచెల్ – 743 రేటింగ్ పాయింట్లు
ఇక ఆల్‌రౌండర్ల జాబితా విషయానికి వస్తే.. టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు తొలి రెండు స్థానాల్లో నిలిచారు. అక్షర్ పటేల్ ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు.
Prithvi Shaw : ఐపీఎల్ మెగావేలం తరువాత.. పృథ్వీ షా పాత వీడియో వైరల్..
ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్..
1. రవీంద్ర జడేజా – 423 రేటింగ్ పాయింట్లు
2. రవిచంద్రన్ అశ్విన్ – 290 రేటింగ్ పాయింట్లు
3. షకిబ్ అల్ హసన్ – 269 రేటింగ్ పాయింట్లు
3. మెహదీ హసన్ మిరాజ్ – 269 రేటింగ్ పాయింట్లు
5. జేసన్ హోల్డర్ – 264 రేటింగ్ పాయింట్లు
Back to the top and a career-best rating 🙌
One of India’s best headlines the latest ICC Rankings moves 👇https://t.co/aJzYloew2R
— ICC (@ICC) November 27, 2024