Prithvi Shaw : ఐపీఎల్ మెగావేలం తరువాత.. పృథ్వీ షా పాత వీడియో వైరల్..
మెగా వేలం ముగిసిన తరువాత మరోసారి అతడు ట్రోలింగ్ బారిన పడ్డాడు.

Prithvi Shaw old Video is Viral After IPL 2025 Auction Snub
చాలా తక్కువ సమయంలో టీమ్ఇండియాలో చోటు సంపాదించుకున్నాడు పృథ్వీ షా. ఎంత త్వరగా జాతీయ జట్టులో అడుగుపెట్టాడో అంతే త్వరగా జట్టుకు దూరం అయ్యాడు. ఇక ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలం 2025లో అతడిని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. కనీస ధర రూ.75లక్షలతో వేలంలో అడుగుపెట్టిన అతడిని సొంతం చేసుకునేందుకు ఒక్క ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపకపోవడంతో అన్‌సోల్డ్ ప్లేయర్‌గా మిగిలిపోయాడు.
గత ఏడాది వరకు ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున బరిలోకి దిగాడు పృథ్వీ. అయితే.. ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయడంలో విఫలం కావడంతో అతడిని ఢిల్లీ అట్టి పెట్టుకోలేదు. వేలానికి విడిచిపెట్టింది. వేలంలోనూ అతడిని సొంతం చేసుకునే ప్రయత్నం చేయలేదు. అతడి పేలవ ఫామ్‌తో పాటు ఫిట్‌నెస్ లేమీ, నిర్లక్ష్యం వంటి అంశాలు కూడా అతడిని తీసుకోకపోవడానికి గల కారణాలు అంటూ వార్తలు వస్తున్నాయి.
IND vs AUS : గెలుపు జోష్‌లో ఉన్న భారత్ కు మరో షాక్.. రెండో టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం!
గతకొన్నాళ్లుగా ఈ స్టార్ ఆటగాడు ఆటతో కంటే వివాదాలతోనే వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ క్రమంలో ట్రోలింగ్‌కు గురి అవుతున్నాడు. మెగా వేలం ముగిసిన తరువాత మరోసారి అతడు ట్రోలింగ్ బారిన పడ్డాడు. కాగా.. ఇప్పుడు గతంలో అతడు మాట్లాడిన ఓ వీడియో నెట్టింట్ వైరల్‌గా మారింది. తన గురించి జరిగే ట్రోలింగ్‌తో పాటు మీమ్స్ కూడా చూస్తుంటానని చెప్పాడు.
ఎవరైనా సరే నన్ను ఫాలో కాకపోతే ఎలా ట్రోల్ చేస్తారు అని పృథ్వీ ప్రశ్నించాడు. అంటే దాని అర్థం అతడి కళ్లు అన్ని నాపైనే ఉన్నాయి. ఇక ట్రోలింగ్ అనేది మంచి విషయం కాదు. అలాగని చెడ్డ విషయం కాదన్నాడు. కేవలం ఆటగాళ్లు మాత్రమే కాదు ఇతర రంగాలకు చెంవిన వ్యక్తులను ట్రోలింగ్ చేయడం చూస్తూనే ఉంటామన్నాడు. తనపై చేసిన ట్రోలింగ్‌లు, మీమ్స్‌లు అన్నీ కూడా చూస్తుంటానని, అవి కొన్నిసార్లు బాధకలిగిస్తుంటాయన్నాడు.
నేను బయట ఎక్కడైన కనిపిస్తే.. సాధన చేయడం లేదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. పుట్టిన రోజు కూడా బయటకు వెళ్లకూడదని అనుంకుటూ ఉంటారు. నేను ఏం తప్పు చేశానో కూడా అర్థం కాని పరిస్థితి ఇది అని పృథ్వీ అన్నాడు. మనం ఏం చేసినా తప్పుబట్టే వాళ్లు ఉంటారు అని అర్థం చేసుకున్నా. తప్పు లేదని తెలిస్తే దానిని అందరికి కనిపించేలా చేయాలి అని ఆ వీడియోలో పృథ్వీ అన్నాడు.
Prithvi Shaw making some sense, well said! pic.twitter.com/OnbOaQQX69
— Prayag (@theprayagtiwari) November 25, 2024