రుతురాజ్ గైక్వాడ్‌కు సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతల గురించి ధోనీ ఎప్పుడు చెప్పాడో తెలుసా..

ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం రాత్రి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో కేకేఆర్ జట్టుతో సీఎస్కే తలపడింది..

Ruturaj Gaikwad

Ruturaj Gaikwad : ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం రాత్రి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో కేకేఆర్ జట్టుతో సీఎస్కే తలపడింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించింది. దీంతో ఈ టోర్నీలో మొత్తం ఐదు మ్యాచ్ లు ఆడిన సీఎస్కే జట్టు.. మూడు విజయాలు, రెండు అపజయాలతో పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో ఉంది. కేకేఆర్ పై విజయం అనంతరం సీఎస్కే జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మీడియాతో మాట్లాడారు. కెప్టెన్సీ గురించి చెబుతూ.. ధోనీ 2022లోనే నాకు కెప్టెన్సీ గురించి చెప్పాడు. వచ్చే ఐపీఎల్ లేదా 2024 ఐపీఎల్ టోర్నీలో జట్టు సారథ్య వహించే అవకాశం రావొచ్చని, అందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించాడని రుతురాజ్ గైక్వాడ్ అన్నారు.

Also Read : IPL 2024 : ఎంఎస్ ధోని దెబ్బకు గ్రౌండ్‌లో చెవులు మూసుకున్న ఆండ్రీ రస్సెల్.. వీడియో వైరల్

ధోనీ కెప్టెన్సీ విషయం గురించి చెప్పిన నాటినుంచి సీఎస్కే ఆడే ప్రతీ మ్యాచ్ ను క్షుణ్ణంగా గమనిస్తూ వచ్చాను. మ్యాచ్ సందర్భాన్ని బట్టి ధోనీ ఫీల్డింగ్ మార్పు, బౌలింగ్ మార్పులు ఎలా చేస్తున్నాడో గమనించాను. అయితే, ధోనీ కెప్టెన్సీ విషయాన్ని తనవద్ద ప్రస్తావించిన తరువాత నేను పెద్దగా ఆశ్చర్య పోలేదు. ఎందుకంటే కెప్టెన్సీ అనేది నాకు కొత్తకాదు. రంజీల్లో కెప్టెన్సీగా వ్యవహరించాను. గేమ్ ఎలా సాగుతుంది.. ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. అయితే, గత ఐపీఎల్ సీజన్ లో ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, నేను ఎప్పుడూ కెప్టెన్సీ గురించి చర్చించుకునే వాళ్లం. మ్యాచ్ తరువాత నేను ఎలా భావించాను.. బౌలింగ్ లో ఎలాంటి మార్పులు చేయాలని నేను అనుకున్నాను.. ఎందుకు అలా చేయాలనుకుంటున్నాను అనే విషయాలపై మాట్లాడుకునే వాళ్లం అని గైక్వాడ్ అన్నారు.

Also Read : IPL 2024 : చెన్నై స్టేడియంలో ప్రేక్షకులను ఆటపట్టించిన రవీంద్ర జడేజా.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు!

గైక్వాడ్ ను 2019 ఐపీఎల్ కోసం సీఎస్కే జట్టు కొనుగోలు చేసింది. అతను ఆ సీజన్ లో ఏ మ్యాచ్ ఆడలేదు. 2020లో తుది జట్టులో చేరాడు. గైక్వాడ్ కెప్టెన్సీగా బాధ్యతలు చేపట్టిన తరువాత.. ఈ సీజన్ లో ఐదు ఇన్నింగ్స్ లో 117.42 స్ట్రైక్ రేట్ తో ఐదు ఇన్నింగ్స్ లో 155 పరుగులు చేశాడు.

 

ట్రెండింగ్ వార్తలు