South Africa Vs India 2nd Test Updates : 122 ఏళ్లలో ఇదే తొలిసారి.. కేప్‌టౌన్‌ టెస్టులో అనేక రికార్డులు.. రోహిత్ శర్మ ధోనీ సరన నిలుస్తాడా?

తొలిఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. తొలుత కాస్త పర్వాలేదనిపించింది. నాలుగు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. అయితే, ఆ తరువాత ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఒక్క పరుగు చేయకుండానే

South Africa Vs India 2nd Test

IND v SA 2nd test : ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్‌టౌన్‌ వేదికగా జరిగిన రెండోటెస్టులో వికెట్ల వర్షం కురిసింది. ఒకేరోజు ఏకంగా 23 వికెట్లను ఇరు జట్ల బౌలర్లు పడగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టుకు ప్రారంభం నుంచి ఎదురు దెబ్బలే తగిలాయి. టీమిండియా ఫాస్ట్ బౌలర్ సిరాజ్ బౌలింగ్ దాటికి సౌతాఫ్రికా బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో సఫారీ జట్టు 23.2 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయింది. హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.

Kareena Kapoor and Saif Ali Khan : ISPL కోల్‌కతా యజమానులైన బాలీవుడ్ స్టార్ కపుల్

తొలిఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. తొలుత కాస్త పర్వాలేదనిపించింది. నాలుగు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. అయితే, ఆ తరువాత ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఒక్క పరుగు చేయకుండానే మిగిలిన బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే, తొలి ఇన్నింగ్స్ లో భారత్ జట్టుకు 98 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. అయితే, తొలిరోజు ఆట మొత్తం బౌలర్లదేనని చెప్పొచ్చు. ఇరు జట్ల బౌలర్లు ఒకేరోజు ఏకంగా 23 వికెట్లు పడగొట్టారు.

Also Read : ఆరుగురు డకౌట్.. 153 పరుగులకు కుప్పకూలిన టీమిండియా

ఇండియా – సౌతాఫ్రికా రెండోటెస్ట్.. పలు రికార్డులు.. 

  • ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా రెండో టెస్టులో తొలిరోజు 23 వికెట్లు పడ్డాయి. ఇలా జరగడం 122ఏళ్లలో ఇదే తొలిసారి. 1902లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్లో తొలిరోజు 25 వికెట్లు పడ్డాయి.
  • 153 వద్ద టీమిండియా ఒక్క పరుగు చేయకుండానే ఆరు వికెట్లు కోల్పోయింది. ఇలా ఒకే స్కోర్ వద్ద టెస్టుల్లో ఏ జట్టూ ఇన్ని వికెట్లు కోల్పోలేదు. గత రికార్డు ఐదు వికెట్లు.
  • తొలి ఇన్నింగ్స్ లో సిరాజ్ వేసిన ఓవర్లు తొమ్మిది. అయితే, ఓ భారత బౌలర్ ఆరు అంతకంటే ఎక్కువ వికెట్లు ఇంత తక్కువ ఓవర్లలో పడగొట్టడం ఇదే తొలిసారి. వెంకటేశ్ ప్రసాద్ 1999లో పాక్ పై 10.2 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. ఆ రికార్డు సిరాజ్ బద్దలు కొట్టాడు.
  • టెస్టు క్రికెట్లో అత్యల్ప స్కోర్ల జాబితాలో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ (55ఆలౌట్) స్థానం తొమ్మిది. గత నాలుగు అత్యల్ప స్కోర్లలో మూడు కేప్ టౌన్ లోనే నమోదయ్యాయి.
  • 1932 తరువాత టెస్టు క్రికెట్లో దక్షిణాఫ్రికాకు 55 పరుగులే అత్యల్ప స్కోరు. భారత్ పై ఏ జట్టుకైనా ఇదే అత్యల్పం. కివీస్ (62)ను సఫారీ జట్టు అధిగమించింది.
  • గతంలో 2008లో భారత జట్టుపై దక్షిణాఫ్రికా కూడా ఇదే ఫీట్ సాధించింది. 2008 భారత పర్యటనలో.. దక్షిణాఫ్రికా అహ్మదాబాద్ టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియాను 76 పరుగులకు ఆలౌట్ చేసింది. ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కూడా మ్యాచ్ తొలి సెషన్‌లోనే భారత్‌ను చిత్తు చేసింది.
  • టీమిండియా గతంలో సౌతాఫ్రికాలో ఎనిమిది టెస్టు సిరీస్ లు ఆడింది. ఇందులో భారత్ ఏడు సిరీస్ లను కోల్పోగా.. ఒక్క సిరీస్ ను డ్రాగా ముగిసింది. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ ను డ్రా చేసుకున్న ఏకైక భారత కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాత్రమే. ధోనీ సరసన రోహిత్ శర్మ చేరుతాడో లేదో ఎదురు చూడాల్సిందే.