ఆరుగురు డకౌట్.. 153 పరుగులకు కుప్పకూలిన టీమిండియా
రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా బ్యాటర్లు బెంబేలెత్తారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 55 పరుగలకే చాప చుట్టేశారు.

South Africa vs India 2nd test updates and highlights
IND v SA 2nd test : టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 153 పరుగులకు ఆలౌటైంది. చివరి నలుగురు బ్యాటర్లు ఒక్క పరుగు కూడా జోడించకుండానే అవుటయ్యారు. 153 స్కోరు వద్ద కేఎల్ రాహల్ ఐదో వికెట్ గా అవుటయ్యాడు. తర్వాత వచ్చిన బ్యాటర్లు అందరూ ఒక్క పరుగు కూడా చేయకుండానే చేతులెత్తేశారు. దీంతో అదే స్కోరు వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ కు 98 పరుగుల ఆధిక్యం లభించింది.
విరాట్ కోహ్లి(46) టాప్ స్కోరర్ గా నిలిచాడు. రోహిత్ శర్మ 39, శుభమాన్ గిల్ 36, కేఎల్ రాహుల్ 8 పరుగులు చేశారు. యశస్వి జైశ్వాల్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, సిరాజ్, బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ డకౌటయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబడ, నాండ్రే బర్గర్, లుంగి ఎంగిడి మూడోసి వికెట్లు పడగొట్టారు.
శ్రేయస్ అయ్యర్ డకౌట్
శ్రేయస్ అయ్యర్ నాలుగో వికెట్ గా పెవిలియన్ చేరాడు. కేవలం 2 బంతులు మాత్రమే ఆడి నాండ్రే బర్గర్ బౌలింగ్ లో డకౌటయ్యాడు. అంతకుముందు శుభమాన్ గిల్(36) మూడో వికెట్ గా అవుటయ్యాడు. టీ విరామ సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. కోహ్లి(20), కేఎల్ రాహుల్(0) ఆడుతున్నారు.
రోహిత్ శర్మ అవుట్
టీమిండియా 72 పరుగుల వద్ద రెండో వికెట్ నష్టపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 39 పరుగులు చేసి నాండ్రే బర్గర్ బౌలింగ్ లో అవుటయ్యాడు.
యశస్వి జైశ్వాల్ డకౌట్
సౌతాఫ్రికాను స్వల్ప స్కోరుకే అవుట్ చేసి ఫస్ట్ ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా 17 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ డకౌటయ్యాడు. 7 బంతులు ఆడి పరుగులేమీ చేయకుండానే రబడ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. రోహిత్ శర్మ 12 పరుగులతో ఆడుతున్నాడు.
55 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్
సౌతాఫ్రికాతో మొదటి టెస్టులో దారుణ ఓటమి చవిచూసిన టీమిండియా రెండో టెస్ట్ లో మాత్రం విజృంభించింది. బుధవారం ప్రారంభమైన సెకండ్ టెస్ట్ లో దక్షిణాఫ్రికా భరతం పట్టింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో సఫారీ జట్టును 23.2 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ చేసింది. భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా బ్యాటర్లు బెంబేలెత్తారు. హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ పదునైన బంతులతో సౌతాఫ్రికా బ్యాటర్లను వరుసగా పెవిలియన్ కు పంపించాడు. మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
ఫాస్ట్ బౌలర్ల విజృంభణ
సౌతాఫ్రికా బ్యాటర్లలో డేవిడ్ బెడింగ్‌హామ్(12), కైల్ వెర్రెయిన్(15) మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేయగలిగారు. మార్కో జాన్సెన్ డకౌటయ్యాడు. భారత ఫాస్ట్ బౌలర్ల విజృంభణతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్ కు క్యూ కట్టారు. ముఖ్యంగా సిరాజ్ చెలరేగంతో సౌతాఫ్రికా స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. బుమ్రా, ముకేశ్ కుమార్ రెండేసి వికెట్లు తీశారు. ఫాస్ట్ బౌలర్లే అన్ని వికెట్లు పడగొట్టడం విశేషం.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా
కేప్ టౌన్ వేదికగా ప్రారంభమైన రెండో టెస్ట్ లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. భారత జట్టులో రెండు మార్పులు జరిగాయి. అశ్విన్ స్థానంలో రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ ప్లేస్ లో ముఖేశ్ కుమార్ జట్టులోకి వచ్చారు.
తుది జట్లు
దక్షిణాఫ్రికా
డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రామ్, టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రెయిన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, నాండ్రే బర్గర్, లుంగి ఎన్‌గిడి
భారత్
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ముఖేష్ కుమార్