Kareena Kapoor and Saif Ali Khan : ISPL కోల్‌కతా యజమానులైన బాలీవుడ్ స్టార్ కపుల్
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ఆరవ జట్టు యజమానులు ఎవరో ఖరారైంది. బాలీవుడ్ స్టార్ కపుల్ కరీనా-సైఫ్ ఖాన్ కోల్‌కతా యజమానులమని ప్రకటించారు.

Kareena Kapoor and Saif Ali Khan
Kareena Kapoor and Saif Ali Khan : ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ కోల్‌కతా జట్టు యజమానులు ఎవరో డిసైడ్ అయిపోయింది. కోల్ కతా జట్టు యజమానులమని బాలీవుడ్ స్టార్ కపుల్ కరీనా కపూర్-సైఫ్ అలీ ఖాన్ ప్రకటించారు.
Suriya : బాలీవుడ్ స్టార్స్‌తో పాటు రామ్‌చరణ్‌పై పోటీకి దిగుతున్న సూర్య.. ISPL బరిలోకి ఎంట్రీ..
భారతదేశంలో మొదటిసారి ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL -T10) ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ టోర్నమెంట్ మార్చి 2 నుండి మార్చి 9 వరకు ముంబయిలో జరగబోతోంది. మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో 19 మ్యాచ్‌లు జరగబోతున్నాయి. టాలెంట్ ఉన్న ఆటగాళ్లను ప్రోత్సహించమే లక్ష్యంగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 5 జట్ల యజమానుల పేర్లు ప్రకటించగా ఈరోజు మిగిలిన 6 వ జట్టు యజమానుల ప్రకటనతో 6 జట్ల యజమానులు తలపడబోతున్నారు.
Ram Charan : కొత్త బిజినెస్‌లోకి గ్లోబల్ స్టార్.. ISPL హైదరాబాద్ టీమ్ చరణ్ దే..
ముంబయి జట్టుకి అమితాబ్ బచ్చన్, శ్రీనగర్ జట్టుకి అక్షయ్ కుమార్, హైదరాబాద్ జట్టుకి రామ్ చరణ్, చెన్నై టీమ్ సూర్య, బెంగళూరు జట్టుకి హృతిక్ రోషన్ యజమానులుగా ఇప్పటికే ప్రకటించారు. తాజాగా కోల్‌కతా జట్టుకి బాలీవుడ్ స్టార్ కపుల్ కరీనా కపూర్, సైఫ్ ఖాన్ ఓనర్స్‌గా ప్రకటించారు. ‘ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా జట్టుపై మా యాజమాన్యాన్ని ప్రకటించినందుకు చాలా థ్రిల్‌గా ఉంది! యువ ఔత్సాహిక క్రికెటర్లకు ఇది అద్భుతమైన అవకాశం మరియు మేము ఈ అనుభవంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’ అంటూ కరీనా ట్వీట్ చేసారు. సైఫ్ ఖాన్, కరీనా కపూర్ ఐఎస్‌పిఎల్ లోకి ప్రవేశించడం తమ లీగ్‌లో ముఖ్యమైన ఘట్టమని ఆటపై వారికి ఉన్న మక్కువ కోల్‌కతా ఔత్సాహిక క్రికెటక్లకు స్ఫూర్తినిస్తుందని ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ కోర్ కమిటీ సభ్యుడు ఆవిష్ షెలార్ చెప్పారు.
View this post on Instagram