Suriya : బాలీవుడ్ స్టార్స్‌తో పాటు రామ్‌చరణ్‌పై పోటీకి దిగుతున్న సూర్య.. ISPL బరిలోకి ఎంట్రీ..

ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ 2024 చెన్నై జట్టు యజమాని ఎవరో తేలిపోయింది. తమిళ నటుడు సూర్య చెన్నై జట్టు కొనుగోలు చేసారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసారు.

Suriya : బాలీవుడ్ స్టార్స్‌తో పాటు రామ్‌చరణ్‌పై పోటీకి దిగుతున్న సూర్య.. ISPL బరిలోకి ఎంట్రీ..

Suriya

Suriya : ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ 2024 ఓనర్స్ లిస్ట్‌లో ప్రముఖ నటుడు సూర్య చేరారు. ISPL 10 చెన్నై జట్టుని కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు.

ఐఎస్పీఎల్ 10 చెన్నై జట్టుని యజమానిగా మారారు ప్రముఖ నటుడు సూర్య. ISPL -T10 లో ఉన్న ఆరు జట్లలో ఇప్పటికే శ్రీనగర్- అక్షయ్ కుమార్, బెంగళూరు- హృతిక్ రోషన్, ముంబయి-అమితాబ్ బచ్చన్ , హైదరాబాద్-రామ్ చరణ్ కొనుగోలు చేసారు. కాగా కోల్‌కతా యజమాని ఎవరో అనౌన్స్ కావాల్సి ఉంది. ఐఎస్పీఎల్ లో 10 మార్చి 2 న ప్రారంభమవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.

ISPL 10 చెన్నై జట్టుని కొనుగోలు చేసినట్లు సూర్య తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసారు. ‘ISPL 10 మా చెన్నై యాజమాన్యాన్ని ప్రకటించడానికి నేను ఎలక్ట్రిఫైడ్‌ను మించిపోయాను..’ అంటూ సూర్య పోస్టు పెట్టారు. ఔత్సాహిక క్రికెటర్లందరికీ మనం క్రీడా స్ఫూర్తి, దృఢత్వం మరియు క్రికెట్ నైపుణ్యం యొక్క వారసత్వాన్ని సృష్టిద్దాం.. అంటూ ప్లేయర్స్‌ను రిజిస్టర్ చేసుకోమని ఆహ్వానిస్తూ సూర్య పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.

టీ 20 లో 20 ఓవర్లు ఉంటాయి. అయితే ఐఎస్పీఎల్‌లో 10లో 10 ఓవర్లు ఉంటాయి. సూర్య టీమ్‌తో ఆడాలని తహతహలాడుతున్న ప్లేయర్స్ వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవడమే. అటు సినిమాలతో బిజీగా ఉంటూనే ఇటు బిజినెస్‌లోనూ తన సక్సెస్‌ను పరీక్షంచుకునేందుకు సూర్య అడుగులు వేస్తున్నారు.