సచిన్.. ఐదేళ్ల గ్యాప్ తర్వాత తొలి బంతి ఫోర్

సచిన్.. ఐదేళ్ల గ్యాప్ తర్వాత తొలి బంతి ఫోర్

Updated On : February 9, 2020 / 8:31 AM IST

తీరని లోటుగా మిగిలిన సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ మరోసారి అభిమానులకు కనువిందు చేస్తుంది. 2013లో ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన సచిన్.. 2014లో ఎమ్సీసీ వేదికగా జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్ లో కనిపించాడు. ఐదేళ్ల నుంచి ఒక్క మ్యాచ్ లోనూ కనిపించని సచిన్.. ఆదివారం మరోసారి బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగడమే కాదు. తొలి బంతినే ఫోర్గా మలిచాడు. 

ఆస్ట్రేలియాలో జ‌రుగుతున్న మ్యాచ్‌లో అక్కడి అభిమానుల‌ు విసిరిన ఛాలెంజ్ కు బ్యాట్ అందుకున్నాడు మాస్టర్ బ్లాస్టర్. తొలి బంతినే ఫోర్ గా మలిచాడు. కార్చిచ్చు కార‌ణంగా న‌ష్ట‌పోయిన వారిని ఆదుకునేందుకుగాను ఆస్ట్రేలియా బుష్ఫైర్ క్రికెట్ బాష్ 2020 మ్యాచ్ నిర్వ‌హిస్తుంది. ఈ మ్యాచ్‌లోని రెండు జ‌ట్ల‌కు ఒక‌వైపు పాంటింగ్‌, మ‌రోవైపు గిల్‌క్రిస్ట్ కెప్టెన్సీ వ‌హిస్తున్నారు. 

వాస్తవానికి ఈ మ్యాచ్ శ‌నివార‌మే జ‌ర‌గాల్సి ఉండ‌గా.. వ‌ర్షం కార‌ణంగా ఆదివారానికి వాయిదా ప‌డింది. ఈ మ్యాచ్‌లో సచిన్, యువీ స‌హా ఎంతోమంది ఉన్నారు. భార‌త్ నుంచి సచిన్ కోచ్ పాత్ర పోషిస్తుండగా.. యువీ ప్లేయర్‌గా ఆడుతున్నాడు. మిగ‌తా వారిలో ఆడ‌మ్ గిల్‌క్రిస్ట్‌, రికీ పాంటింగ్, షేన్‌వార్న్‌, మ‌థ్యూ హేడెన్‌, కోట్నీ వాల్ష్‌, బ్రియాన్ లారా, జ‌స్టిన్ లాంగ‌ర్ త‌దిత‌రులు ఉన్నారు.