సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఎక్కడ, ఎలా ఆడారో చూడండి..

‘క్రికెట్.. కశ్మీర్: స్వర్గంలో ఒక మ్యాచ్’ అని సచిన్ పేర్కొన్నారు.

మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గల్లీ క్రికెట్ ఆడి అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘క్రికెట్.. కశ్మీర్: స్వర్గంలో ఒక మ్యాచ్’ అని సచిన్ పేర్కొన్నారు. కశ్మీర్‌లోని గుల్మార్గ్ లో కొంతమంది యువకులతో కలిసి క్రికెట్ ఆడి సచిన ఈ వీడియో తీసుకున్నారు.

సచిన్‌ టెండూల్కర్ బ్యాటింగ్‌ చేస్తుండగా కొందరు యువకులు, భద్రతా సిబ్బంది ఫీల్డింగ్‌ చేశారు. కాలక్షేపం కోసం రోడ్డు పక్కన ఇలా యువకులు ఆడుతుండడం చూసిన సచిన్.. కారు దిగి వారితో కలిసి ఆడినట్లు తెలుస్తోంది. సచిన్ బ్యాటింగ్ చేశాక ఆయనతో యువకులు సెల్ఫీలు దిగారు. సచిన్ జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాలను సందర్శించారు.

సచిన్‌కు సంబంధించిన ఇటువంటి వీడియోలు తరుచూ వైరల్ అవుతుంటాయి. గతంలోనూ ఓ సారి సచిన్ ఇలాగే ముంబైలో ఓ సారి గల్లీలో పిల్లలతో కలిసి క్రికెట్ ఆడారు. ఎన్నో ప్రపంచ రికార్డులను నెలకొల్పిన సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ ఆయన క్రేజ్ ఏ మాత్రం చెక్కుచెదరలేదు. రిటైర్‌మెంట్‌ తర్వాత ఆయన కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. క్రికెట్‌కు 2013లో సచిన్ రిటైర్మెంట్ ప్రకటించారు.

Akaay Meaning : విరుష్క జంట తనయుడు ‘అకాయ్’ పేరుకు అర్థం ఏంటి? నెట్టింట్లో తెగ వెతికేస్తున్నారు!

ట్రెండింగ్ వార్తలు