Akaay Meaning : విరుష్క జంట తనయుడు ‘అకాయ్’ పేరుకు అర్థం ఏంటి? నెట్టింట్లో తెగ వెతికేస్తున్నారు!

Akaay Meaning : విరాట్ కోహ్లి, అనుష శర్మ దంపతులకు రెండో బిడ్డ జన్మించగా.. ‘అకాయ్’ అని నామకరణం చేశారు. ఇప్పుడా ఆ పేరుకు అర్థం ఏంటో తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.

Akaay Meaning : విరుష్క జంట తనయుడు ‘అకాయ్’ పేరుకు అర్థం ఏంటి? నెట్టింట్లో తెగ వెతికేస్తున్నారు!

What is The Meaning Of Akaay : The Name of Virat Kohli-Anushka Sharma Son

Akaay Meaning : భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు తమ రెండవ బిడ్డకు ‘అకాయ్’ అనే పేరుతో నామకరణం చేశారు. ఈ జంట ఫిబ్రవరి 15, 2024న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, విరుష్క జంట కుమారుడు అకాయ్ పేరు గురించే నెట్టింట్లో చర్చ నడుస్తోంది. ఇంతకీ ఆ పేరుకు అర్థం ఏంటి? కోహ్లీ, అనుష్క ఎందుకు ఈ ప్రత్యేకమైన పేరునే పెట్టారు? అసలు దీని అర్థం ఏంటో తెలుసుకోవాలనే ఉత్సాహంతో నెట్టింట తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు.

Read Also : Sachin Tendulkar : విరుష్క జంటకు సచిన్ టెండూల్కర్ అభినందనలు.. ప్రపంచానికి స్వాగతం.. ‘అకాయ్’ లిటిల్ ఛాంప్! అంటూ ట్వీట్!

కానీ, ఈ పేరుపై ఒక్కొక్కరు ఒక్కో అర్థాన్ని చెబుతున్నారు. అకాయ్ పేరుకు సంస్కృతంలో ‘నిరాకార్’ లేదా అమరుడు అనే అర్థం వస్తుందని అంటున్నారు. అదేవిధంగా టర్కిష్‌లో ప్రకాశించే నిండు చంద్రునితో సహా విభిన్న సాంస్కృతిక వివరణలు ఉన్నాయి. హిందీలో మాత్రం ‘కాయ్’ అంటే శరీరం.. అకాయ్ అంటే.. భౌతిక శరీరానికి మించినవాడని ఒక్కో అర్థాన్ని చెబుతున్నారు. సాంస్కృతిక మూలాలను, సాంప్రదాయ భారతీయ పేర్లు ప్రతిబింబించేలా అర్ధవంతమైన పేరుగా చెబుతున్నారు. ఏది ఏమైనా.. అకాయ్ అంటే ఎలాంటి అర్థం వచ్చేలా పెట్టారో విరుష్క జంటనే చెప్పాలి మరి..

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ 2017లో పెళ్లి చేసుకున్నారు. జనవరి 2021లో వారికి మొదటి బిడ్డగా వామిక అనే కుమార్తె జన్మించింది. ఆమె పేరు సంస్కృతంలో దుర్గాదేవిని సూచిస్తుంది. ఈ జంటకు వారి అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చాలా మంది ఈ పేరు అసలు అర్థం ఏంటో చెప్పాలని కోరుతున్నారు.

విరాట్ కోహ్లీ, భార్య అనుష్క శర్మ తమకు మగబిడ్డ పుట్టాడని మంగళవారం ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. ఆ బిడ్డను ‘ ఆకాయ్ ‘ అనే పేరుతో ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ ఆనంద సమయంలో మీ ఆశీర్వాదాలు కావాలని, ఏకాంతాన్ని గౌరవించమని కోరుతున్నామని కోహ్లి పోస్టులో తెలిపాడు. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నుంచి విరాట్ వైదొలిగిన సంగతి తెలిసిందే.

Read Also : Virat Kohli son Akaay : ఇన్‌స్టాగ్రామ్‌లో స్టార్ అయిన విరాట్ కొడుకు.. 24గంటల్లో ఏం జరిగిందో తెలుసా?