Sachin Tendulkar Posts Heartwarming Message On His Late Fathers Birthday
Sachin Tendulkar Father’s Birthday : సొగసైన బ్యాటింగ్‌తో.. కళ్లు తిప్పుకోనివ్వని షాట్లతో.. బౌలర్లపై ఆధిపత్యంతో.. ప్రపంచ క్రికెట్‌ను ఏలిన దిగ్గజం సచిన్ టెండూల్కర్. ఆయన తండ్రి రమేశ్ టెండూల్కర్ జన్మదినోత్సవం నేడు (18 డిసెంబర్ 1930). ఈ సందర్భంగా సచిన్ సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు. తన తండ్రితో ఉన్న ఫోటోను పంచుకుంటూ తన తండ్రి శ్రద్ధగా ఉండేవారని, కానీ ఎప్పుడూ కఠినంగా ఉండేవారు కాదని చెప్పుకొచ్చారు. తన కలలను సాకారం చేసుకోవడానికి తనకు ఎంతో మద్దతుగా నిలిచారన్నారు.
‘మా నాన్న ఎప్పుడూ శ్రద్ధగా ఉండేవాడు కానీ ఎప్పుడూ కఠినంగా ఉండడు. నేను జీవితంలో ఏమి చేయాలనుకుంటున్నానో దాన్ని ఎంచుకోవడానికి నన్ను ప్రోత్సహించారు. నా కలలను సాధించాలనే నా అన్వేషణలో నాకు బేషరతుగా మద్దతు ఇచ్చారు. పిల్లలకు ప్రేమ, స్వేచ్ఛను ఇస్తూ తను పెంచిన విధానం పేరెంటింగ్‌లో గొప్ప పాఠం. ఆయన ఆలోచనలు కాలం కంటే ముందు ఉంటాయి. ‘ అని సచిన్ టెండూల్కర్ రాసుకొచ్చారు. దివంగత తండ్రిని తాను అంతగా ప్రేమించడానికి ఇది మిలియన్ కారణాలలో ఇది ఒకటి అని సచిన్ అన్నారు.
My father was always caring but never strict. He let me choose what I wanted to do in life and supported me unconditionally in my quest to achieve my dreams. I think the way he raised all his children–always giving us love and freedom–is an excellent lesson in parenting. His… pic.twitter.com/b1qumJnuNO
— Sachin Tendulkar (@sachin_rt) December 18, 2023
తండ్రి పుట్టిన రోజే వన్డేల్లో అరంగ్రేటం..
1973 ఏప్రిల్ 24న ముంబైలో సచిన్ జన్మించాడు. అతి పిన్న వయసులోనే టీమ్ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. 1989లో అంటే తనకు 16 ఏళ్ల 205 వయసులో కరాచీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచు ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ అడుగుపెట్టాడు. అదే ఏడాది డిసెంబర్ 18న పాకిస్తాన్‌తోనే జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగ్రేటం చేశాడు. తన కెరీర్‌లో మొత్తం 463 వన్డే మ్యాచులు ఆడిన సచిన్ 18,426 పరుగులు చేశాడు. 49 శతకాలు, 96 అర్ధశతకాలు అతడి పేరిట ఉన్నాయి. అత్యధిక స్కోరు 200 నాటౌట్.
Team India : ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్.. టీమ్ఇండియాకు కలిసొచ్చిన అదృష్టం
వన్డేల్లో తొలి సారి డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా సచిన్ నిలిచాడు. వన్డే ప్రపంచకప్ 2023లో విరాట్ కోహ్లీ శతకాల రికార్డును బ్రేక్ చేసేంత వరకు కూడా అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు అతడి పేరు మీదే ఉంది. ఇక ఇప్పటికి కూడా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ కొనసాగుతున్నాడు. అంతేకాకుండా అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన ఆటగాడి రికార్డు కూడా అతడి పేరిటే ఉంది.
34 years since the ?????? ??????? made his ODI Debut for #TeamIndia ?#OneFamily #MumbaiIndians pic.twitter.com/wCTIPb4YPM
— Mumbai Indians (@mipaltan) December 18, 2023