భారత ఎయిర్ ఫోర్స్ చేసిన దాడులలో దాదాపు 200 నుంచి 300 వరకూ మిలిటెంట్లు చనిపోయారంటూ వార్తలొస్తున్నాయి.
భారత ఎయిర్ ఫోర్స్ చేసిన దాడులలో దాదాపు 200 నుంచి 300 వరకూ మిలిటెంట్లు చనిపోయారంటూ వార్తలొస్తున్నాయి. 2019 ఫిబ్రవరి 26న జరిగిన ఈ దాడులు భారత్ సత్తా చాటాయని యావత్ దేశమంతా సగర్వంగా చెప్పుకుంటోంది. సోషల్ మీడియా వేదికగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. పుల్వామా అటాక్ స్పందించని టీమిండియా మాజీ, ప్రస్తుత క్రికెటర్లు సైతం ఈ దాడిపై స్పందిస్తున్నారు.
టీమిండియా క్రికెట్ దిగ్గజం, మాజీ ఎంపీ సచిన్ టెండూల్కర్ తన అధికార ట్విట్టర్ ద్వారా ఇలా పోస్టు చేశారు. ‘మేం చేసిన దాడి క్రూరంగా లేదని భారత దేశం అది మా బలహీనత అనుకోకండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సెల్యూట్ చేస్తున్నా. జై హింద్’ అంటూ ట్వీట్ చేశాడు.
Also Read : బెంగళూరులో డూ ఆర్ డై : రెండో టీ20కి రె‘ఢీ’
వరల్డ్ కప్ టోర్నీలో పాక్ జట్టు నిషేదం గురించి సచిన్ మాట్లాడుతూ.. ‘నాకు వ్యక్తిగతంగా పాక్ తో ఆడి ఓడించాలనే ఉంది. అనవసరంగా వాళ్లకు 2పాయింట్లు ఇవ్వడం సరైంది కాదని భావిస్తున్నాను. వరల్డ్ కప్ టోర్నీలో ప్రతిసారి భారత్‌యే గెలుస్తోంది. కానీ, బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను పూర్తి మద్ధతిస్తాను’ అని వివరించారు.
Our niceness should never be comprehended as our weakness.
I salute the IAF, Jai Hind ??— Sachin Tendulkar (@sachin_rt) February 26, 2019
Also Read : మ్యాచ్ ఫిక్సింగేనా : క్రికెటర్ సనత్ జయసూర్యపై నిషేధం