క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్కు బీసీసీఐ లైఫ్ టైమ్ గిఫ్ట్..

స‌చిన్ టెండూల్క‌ర్‌కు అరుదైన గౌర‌వం ల‌భించ‌నుంది.

Sachin Tendulkar To Be Honoured By BCCI's Lifetime Achievement Award

టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. క్రికెట్ దేవుడిగా అభిమానులు పిలుస్తుంటారు. తాజాగా ఈ దిగ్గ‌జ ఆట‌గాడిని భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు ఘ‌నంగా సత్క‌రించ‌నుంది. శ‌నివారం జ‌ర‌గ‌నున్న‌ వార్షికోత్స‌వంలో స‌చిన్ టెండూల్క‌ర్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు (జీవితకాల సాఫల్య పురస్కారాన్ని) అంద‌జేయ‌నుంది.

భార‌త క్రికెట్‌కు స‌చిన్ అందించిన సేవ‌లు అమోఘం. ఈ నేప‌థ్యంలో సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీమ్‌మెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2024 అవార్డును స‌చిన్‌కు అంద‌జేయ‌నున్నాం అని బీసీసీఐ వ‌ర్గాలు పీటీఐకి వెల్ల‌డించాయి. స‌చిన్‌కు అవార్డు ప్ర‌క‌ట‌న పై మాజీ ఆట‌గాళ్లు, నెటిజ‌న్లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. 51 ఏళ్ల స‌చిన్ ఈ అవార్డు అందుకోనున్న 31వ గ్రహీత. గతేడాది భారత మాజీ కోచ్ రవిశాస్త్రి, మాజీ క్రికెటర్ ఫరూఖ్‌ ఇంజినీర్‌లు ఈ అవార్డును అందుకున్న సంగ‌తి తెలిసిందే.

అండ‌ర్‌-19 మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో భార‌త్‌.. వ‌రుస‌గా రెండోసారి.. సెమీస్‌లో ఇంగ్లాండ్ పై ఘ‌న విజ‌యం..

టీమ్ఇండియా త‌రుపున స‌చిన్ 200 టెస్టులు, 463 వ‌న్డేలు, 1 టీ20 మ్యాచ్ ఆడాడు. 200 టెస్టుల్లో 53.8 స‌గ‌టుతో 15,921 ప‌రుగులు చేశాడు. ఇందులో 51 సెంచ‌రీలు, 68 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. 463 వ‌న్డేల్లో 44.8 స‌గ‌టుతో 18,426 ప‌రుగులు సాధించాడు. ఇందులో 49 సెంచ‌రీలు 96 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఒకే ఒక టీ20 మ్యాచ్‌లో 10 ప‌రుగులు సాధించాడు.

స‌చిన్ ఘ‌న‌త‌లు..

* టీమ్ఇండియా త‌రుపున 664 మ్యాచులు ఆడిన ఒకే ఒక్క ఆట‌గాడు
* అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా నిలిచాడు. స‌చిన్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 34,357 ప‌రుగులు చేశాడు.
* వ‌న్డేల్లో, టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడు
* అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచ‌రీలు చేసిన ఏకైక ఆట‌గాడు.
* ఆరుసార్లు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీలు ఆడిన ఆట‌గాడు.
* వ‌న్డేల్లో తొలి డ‌బుల్ సెంచ‌రీ చేసిన ఆట‌గాడు.

IND vs PAK : ఇండియన్ ప్లేయర్ల విషయంలో పాక్ క్రికెటర్లకు మాజీ కెప్టెన్ వార్నింగ్

2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన జ‌ట్టులో స‌భ్యుడైన స‌చిన్‌.. త‌న 24 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో మైలురాళ్ల‌ను అందుకున్నాడు. 2013లో అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు.