Salman Butt On Indian players: కొందరు భారత క్రికెటర్లు బరువు ఎక్కువగా ఉన్నారు: పాక్ మాజీ కెప్టెన్ వ్యాఖ్యలు

మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో నిన్న జరిగిన భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ లో టీమిండియా 208 పరుగులు చేసినప్పటికీ ఓడిపోయిన విషయంపై పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ పలు వ్యాఖ్యలు చేశారు. టీమిండియా ఫీల్డింగ్ గురించి ఆయన మాట్లాడుతూ... కొందరు భారత్ క్రికెటర్లు బరువు ఎక్కువగా ఉన్నారని చెప్పారు. దీనిపై వారు దృష్టి పెడతారని తాను ఆశిస్తున్నానని, ఎందుకంటే వారు తెలివైన ఆటగాళ్లని అన్నారు.

Salman Butt On Indian players: మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో నిన్న జరిగిన భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ లో టీమిండియా 208 పరుగులు చేసినప్పటికీ ఓడిపోయిన విషయంపై పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ పలు వ్యాఖ్యలు చేశారు. టీమిండియా ఫీల్డింగ్ గురించి ఆయన మాట్లాడుతూ… కొందరు భారత్ క్రికెటర్లు బరువు ఎక్కువగా ఉన్నారని చెప్పారు. దీనిపై వారు దృష్టి పెడతారని తాను ఆశిస్తున్నానని, ఎందుకంటే వారు తెలివైన ఆటగాళ్లని అన్నారు.

భారత ఆటగాళ్లలో ఫిట్ నెస్ లేదని, పేసర్ల బౌలింగ్ తీరు సరిగ్గాలేదని చెప్పారు. వచ్చే నెల నుంచి ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ ముందు ఈ రెండు అంశాలు భారత్ కు సమస్యలుగా మారాయని అన్నారు. ‘‘ఈ అంశంపై ఇతరులు మాట్లాడతారో లేదో కానీ, ఇది నా అభిప్రాయం. టీమిండియా ఫిట్‌నెస్ సరిగ్గాలేదు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాను పక్కనపెడితే, టీమిండియా ఫిట్‌నెస్ విషయంలో బలంగా లేదు.

పేసర్ల బౌలింగ్ తీరు సరిగ్గాలేదు.. ఫీల్డింగ్ సమయంలో వచ్చిన అవకాశాలను భారత ఆటగాళ్లు సరిగ్గా వినియోగించుకోవట్లేదు. కేఎల్ రాహుల్ ఓ క్యాచ్ ను వదిలేశాడు. బాల్ వస్తున్న సమయంలో చాలా నీరసంగా కనపడ్డాడు. అక్షర్ కూడా మిడిల్ వికెట్ క్యాచ్ ను వదిలేశాడు. అటువంటి క్యాచును వదిలేస్తే, ప్రత్యర్థి బ్యాటర్లు ఇక అటువంటి అవకాశాలు ఇవ్వరు. రోహిత్ శంకర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఫీల్డింగ్ విషయంలో దృష్టి పెట్టాలి. వారి ఫిట్ నెస్ ను మెరుగుపర్చుకోవాలి’’ అని సల్మాన్ భట్ అన్నారు.

No Recession For The Indian Economy: భారత్‌లో ఆర్థిక మాంద్యం ఏర్పడే ప్రమాదం లేదు.. ఎందుకంటే..?: గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ 

ట్రెండింగ్ వార్తలు