Sanju Samson: సంజూ శామ్సన్ ఫస్ట్ వన్డే సెంచరీ.. చాలా కాలం గుర్తుంటుంది..

వన్డేల్లో ఫస్ట్ సెంచరీ సాధించి టీమిండియాకు విజయాన్ని సాధించిపెట్టిన యువ బ్యాటర్ సంజూ శామ్సన్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.

Sanju Samson Maiden ODI Ton Triggers Meme Fest

Sanju Samson Maiden ODI Ton: సౌతాఫ్రికాతో మూడో వన్డేల సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. గురువారం జరిగిన చివరి వన్డేలో 78 పరుగులతో గెలిచి 2-1 తేడాతో సిరీస్ దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా బ్యాటర్ సంజూ శామ్సన్ వీరోచిత సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. వన్డేల్లో తొలి సెంచరీ సాధించి జట్టును గెలిపించిన సంజూ శామ్సన్ పై సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

క్లిష్టపరిస్థితుల్లో విదేశీగడ్డపై సంజూ శామ్సన్ ఆడిన వీరోచిత ఇన్నింగ్స్ చాలా కాలం పాటు గుర్తుంటుందని నెటిజనులు అంటున్నారు. తనను ద్వేషించేవారికి స్పెషల్ సెంచరీతో సంజూ సమాధానం చెప్పాడని వ్యాఖ్యానించారు. మున్ముందు కూడా అతడు బాగా ఆడి మరిన్ని సెంచరీలు సాధించాలని ఆకాంక్షించారు. అతడిని టీమిండియాలో కంటిన్యూ చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, సంజూ వ్యతిరేకులపై నెటిజనులు మీమ్స్ తో విరుచుకుపడ్డారు.

Also Read: ధోనీ భయ్యా.. ఐపీఎల్ టోర్నీ గెలవడానికి ఆర్సీబీకి సహాయం చేయండి.. ఆర్సీబీ అభిమాని విజ్ఞప్తికి ధోనీ రిప్లై వైరల్

కేరళ అభిమానులు ఫుల్ ఖుషీ
పలువురు క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు కూడా సంజూ శామ్సన్ కు అభినందనలు తెలిపారు. సాటి కేరళవాసిగా గర్వంగా ఫీలవుతున్నానని టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ అన్నాడు. మాజీ క్రికెటర్లు శిఖర్ ధవన్, మహ్మద్ కైఫ్, మనోజ్ తివారీ తదితరులు సంజూను పొగిడారు. ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాలో నటించిన పృథ్విరాజ్ సుకుమార్ కూడా సంజూను ప్రశంసించారు. మోహన్ లాన్ తాజా చిత్రం నెరు, ప్రభాస్ సలార్ సినిమాలకు పాజిటివ్ టాక్ రావడం.. సంజూ సెంచరీ చేయడంతో కేరళ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

 

ఫామ్ ను కంటిన్యూ చేస్తా
సెంచరీతో చెలరేగిన సంజూ శామ్సన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా సంజూ మాట్లాడుతూ.. ఇదే ఫామ్ ను కంటిన్యూ చేసి, భవిష్యత్తులో టీమిండియాకు మరిన్ని విజయాలు అందించాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. వన్డేల్లో ఫస్ట్ సెంచరీ చేయడం పట్ల చాలా ఎమోషనల్ గా ఫీలవుతున్నానని అన్నాడు. అర్ష్‌దీప్ సింగ్.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికయ్యాడు.

 

ట్రెండింగ్ వార్తలు