MS Dhoni : ధోనీ భయ్యా.. ఐపీఎల్ టోర్నీ గెలవడానికి ఆర్సీబీకి సహాయం చేయండి.. ఆర్సీబీ అభిమాని విజ్ఞప్తికి ధోనీ రిప్లై వైరల్

ధోనీ కెప్టెన్సీ నైపుణ్యాలను కొనియాడి ఆర్సీబీ అభిమాని వచ్చే ఐపీఎల్ టోర్నీలో ఆర్సీబీ జట్టు విజయానికి మద్దతు ఇవ్వాలని కోరాడు. దీని ధోనీ స్పందిస్తూ..

MS Dhoni : ధోనీ భయ్యా.. ఐపీఎల్ టోర్నీ గెలవడానికి ఆర్సీబీకి సహాయం చేయండి.. ఆర్సీబీ అభిమాని విజ్ఞప్తికి ధోనీ రిప్లై వైరల్

MS Dhoni

IPL 2024 MS Dhoni : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యధిక సార్లు ట్రోపీలను గెలుచుకున్న జోట్టు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్ కే). టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ ఆ జట్టుకు కెప్టెన్ గా ఉంటూ వస్తున్నారు. ఇప్పటికీ ఎంఎస్ ధోనీనే సీఎస్కే జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. ధోనీ కెప్టెన్సీ సామర్థ్యాలతో పలు సార్లు ఆ జట్టు ఐపీఎల్ టైటిల్స్ ను గెలుచుకుందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఐపీఎల్ లోని పలు జట్లు ఇప్పటి వరకు ఒక్కసారికూడా ట్రోపీని గెలచుకోలేదు. వాటిలో రాయల్ ఛాలెంజర్స్ (ఆర్సీబీ) జట్టు ఒకటి. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్ లో ధోనీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఆర్సీబీ జట్టు అభిమాని ధోనీని ఓ కోరిక కోరాడు.

Also Read : IPL 2024 Auction : ఐపీఎల్ వేలంలో భారీ ధర లభించడంపై మిచెల్ స్టార్క్ ఏమన్నాడో తెలుసా?.

ధోనీ కెప్టెన్సీ నైపుణ్యాలను కొనియాడి ఆర్సీబీ అభిమాని వచ్చే ఐపీఎల్ టోర్నీలో ఆర్సీబీ జట్టు విజయానికి మద్దతు ఇవ్వాలని కోరాడు. దీని ధోనీ స్పందిస్తూ.. మీకు తెలుసా.. ఆర్సీబీ చాలా మంచి జట్టు. మీరు చూడాల్సింది ఏమిటంటే.. ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరగదు. ఐపీఎల్ లో మొత్తం 10 జట్లు, పూర్తి ఆటగాళ్లను కలిగి ఉంటే చాలా బలమైన జట్లే. సమస్య తలెత్తేది ఎక్కడంటే గాయాల కారణంగా కొంతమంది ఆటగాళ్లను కోల్పోయినప్పుడు. ప్రస్తుతానికి నా సొంత జట్టులో నేను ఆందోళన చెందడానికి చాలా విషయాలు ఉన్నాయి. ప్రతి జట్టు విజేతగా నిలవాలని నేను శుభాకాంక్షలు చెబుతాను అని ధోనీ అన్నారు.

Also Read : IPL auction 2024 : పాపం స్మిత్.. కనీస ధర రూ.2కోట్లు దెబ్బకొట్టిందా? వేలంలో అమ్ముడుపోని స్టార్ ప్లేయర్స్ వీళ్లే

ఐపీఎల్ 2024లో ధోనీ పూర్తిస్థాయి కెప్టెన్సీ చేయడనే వాదన ఉంది. తాజాగా ఐపీఎల్ వేలం సమయంలో జరిగిన విలేకరుల సమావేశంలో చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్ మాట్లాడుతూ.. సీఎస్ కే గత పదేళ్లుగా ధోనీకోసం వారసత్వ ప్రణాళికలను కలిగి ఉందని, అయితే అతను ఎప్పటిలాగే చాలా ఉత్సాహంతో జట్టును నడిపిస్తున్నాడని అన్నారు.