Sanju Samson: ఏ గాయమూ కాకపోయినా ఆసియా కప్-2023 నుంచి ఇంటికి సంజూ శాంసన్‌.. ఎందుకంటే?

కేఎల్ రాహుల్ గ్రూప్ దశ మ్యాచులకు గాయం కారణంగా దూరమైన వేళ అతడి స్థానంలో స్క్వాడ్‌లో సంజూ శాంసన్‌ను తీసుకున్న విషయం తెలిసిందే.

Sanju Samson

Sanju Samson – Asia Cup 2023: టీమిండియా ఆసియా కప్-2023 స్క్వాడ్ నుంచి సంజూ శాంసన్‌ను ఇంటికి పంపారు. ఇక ఈ స్క్వాడ్‌లో అతడి అవసరం లేదని ఈ నిర్ణయం తీసుకున్నారు. సూపర్ 4 దశ మ్యాచుల నేపథ్యంలో స్క్వాడ్‌లో కేఎల్ రాహుల్‌(KL Rahul)ను చేర్చుకోవాలని భారత జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయించిన నేపథ్యంలో ఈ మార్పు చోటుచేసుకుంది.

కేఎల్ రాహుల్ గ్రూప్ దశ మ్యాచులకు గాయం కారణంగా దూరమైన వేళ అతడి స్థానంలో స్క్వాడ్‌లో సంజూ శాంసన్‌ను తీసుకున్న విషయం తెలిసిందే. రాహుల్ పూర్తిగా కోలుకున్నాడని బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ తెలిపింది. ఇప్పటికే కొలంబోలోని నెట్స్ లో రాహుల్ టీమిండియాతో కలిసి కొన్ని గంటల పాటు ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు.

గ్రూప్ దశలో పాకిస్థాన్, నేపాల్ తో భారత్ ఆడింది. సూపర్ 4లో పాకిస్థాన్ తో ఆదివారం టీమిండియా తలపడనుంది. నెట్స్ లో రాహుల్ బాగానే రాణించాడని తెలుస్తోంది.

గురువారం జరిగిన నెట్స్ ప్రాక్టీసులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ పాల్గొనలేదు. శుక్రవారం మాత్రం ప్రాక్టీసులో తలామునకలై కనపడ్డారు. నెట్స్ లో బుమ్రా బౌలింగ్ ను ఎదుర్కోలేక రోహిత్, కోహ్లీ కష్టపడ్డారు. అక్షర్ పటేల్ నెట్స్ లో గంటల తరబడి ప్రాక్టీస్ చేశాడు.

SL vs BAN : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. శ్రీలంక బ్యాటింగ్‌.. Updates In Telugu

ట్రెండింగ్ వార్తలు