SL vs BAN : బంగ్లాదేశ్ పై లంక గెలుపు .. Updates In Telugu

ఆసియా క‌ప్ 2023 సూప‌ర్‌-4లో భాగంగా శ్రీలంక జ‌ట్టుతో బంగ్లాదేశ్ త‌ల‌ప‌డుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ ష‌కీబ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

SL vs BAN : బంగ్లాదేశ్ పై లంక గెలుపు .. Updates In Telugu

SL vs BAN

లంక గెలుపు

258 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన బంగ్లాదేశ్ 48.1వ‌ ఓవ‌ర్ల‌లో 220 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో శ్రీలంక 21 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

 

ముష్ఫికర్ రహీమ్ ఔట్‌..

ధ‌సున్ శ‌న‌క బౌలింగ్‌లో (37.2వ ఓవ‌ర్‌)లో కసున్ రజిత క్యాచ్ అందుకోవ‌డంతో ముష్ఫికర్ రహీమ్(29; 48 బంతుల్లో) ఔట్ అయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ 155 ప‌రుగుల వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 38 ఓవ‌ర్ల‌కు బంగ్లాదేశ్ స్కోరు 160/5. తౌహిద్ హృదయ్ (51), షమీమ్ హొస్సేన్ (1) క్రీజులో ఉన్నారు.


లిట‌న్ దాస్ ఔట్‌..

బంగ్లాదేశ్ మ‌రో వికెట్ కోల్పోయింది. దునిత్ వెల్లలాగే (18.5వ ఓవ‌ర్‌) బౌలింగ్‌లో లిట‌న్ దాస్ (15; 24 బంతుల్లో 1 ఫోర్‌) ఔట్ అయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ 83 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 20 ఓవ‌ర్ల‌కు బంగ్లాదేశ్ స్కోరు 84/4. తౌహిద్ హృదయ్(1), ముష్ఫికర్ రహీమ్ (6) క్రీజులో ఉన్నారు.

 

ష‌కీబ్ ఔట్‌..

మతీషా పతిరనా బౌలింగ్‌లో(15.4వ ఓవ‌ర్‌) షకీబ్ అల్ హసన్ (3; 7 బంతుల్లో) కుశాల్ మెండీస్ చేతికి చిక్కాడు. దీంతో బంగ్లాదేశ్ 70 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది.

 

మహ్మద్ నయీమ్ ఔట్‌

దసున్ షనక బౌలింగ్‌లో (13.4వ ఓవ‌ర్‌) మహ్మద్ నయీమ్ (21; 46 బంతుల్లో 1 ఫోర్‌) కుశాల్ మెండీస్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ 60 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది.

 

హసన్ మిరాజ్ ఔట్

ఓ మోస్తారు ల‌క్ష్య ఛేద‌న‌కు దిగిన బంగ్లాదేశ్‌కు షాక్ త‌గిలింది. దసున్ షనక బౌలింగ్‌లో (11.1వ ఓవ‌ర్‌) హేమంత క్యాచ్ అందుకోవ‌డంతో హసన్ మిరాజ్ (28; 29 బంతుల్లో 4 ఫోర్లు) ఔట్ అయ్యాడు. దీంతో 55 ప‌రుగుల వ‌ద్ద బంగ్లాదేశ్ మొద‌టి వికెట్ కోల్పోయింది.

 

బంగ్లాదేశ్ ల‌క్ష్యం 258

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 257 ప‌రుగులు చేసింది. లంక బ్యాట‌ర్ల‌లో సదీర సమరవిక్రమ (93; 72 బంతుల్లో 8 ఫోర్లు, 2సిక్స‌ర్లు), కుశాల్ మెండీస్ (50; 73 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్‌) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌లోతస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్ చెరో మూడు వికెట్లు తీయ‌గా, షోరిఫుల్ ఇస్లాం రెండు వికెట్లు తీశాడు.

 

ధనంజయ ఔట్‌

శ్రీలంక జ‌ట్టు మ‌రో వికెట్ కోల్పోయింది. హసన్ మహమూద్ బౌలింగ్‌లో (37.1వ ఓవ‌ర్‌) ధనంజయ డిసిల్వా (6; 16 బంతుల్లో) ముష్ఫికర్ రహీమ్ చేతికి చిక్కాడు. దీంతో లంక 164 ప‌రుగుల వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయింది.

 

అస‌లంక ఔట్‌

శ్రీలంక జ‌ట్టు మ‌రో వికెట్ కోల్పోయింది. తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో (31.5వ ఓవ‌ర్‌) చ‌రిత్ అసలంక (10; 23 బంతుల్లో 1ఫోర్‌) ష‌కీబ్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో శ్రీలంక జ‌ట్టు 144 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 32 ఓవ‌ర్ల‌కు శ్రీలంక స్కోరు 144/4. ధనంజయ డిసిల్వా (0), సమరవిక్రమ (19) క్రీజులో ఉన్నారు.

 

స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో రెండు వికెట్లు కోల్పోయిన శ్రీలంక‌

షారిఫుల్ ఇస్లాం శ్రీలంక జ‌ట్టును గ‌ట్టి దెబ్బ‌తీశాడు. త‌న వ‌రుస ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. 23.2వ ఓవ‌ర్‌కు పాతుమ్ నిస్సాంక (40; 60 బంతుల్లో 5 ఫోర్లు) ను, 25.5 ఓవ‌ర్‌కు కుశాల్ మెండీస్ (50; 73 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) పెవిలియ‌న్‌కు చేర్రాడు. దీంతో లంక 117 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది. 26 ఓవ‌ర్ల‌కు శ్రీలంక స్కోరు 121/3 . సదీర సమరవిక్రమ (3), చరిత్ అసలంక(1) క్రీజులో ఉన్నారు.

 

క‌రుణ ర‌త్నె ఔట్‌

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జ‌ట్టుకు ఆదిలోనే షాక్ త‌గిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెన‌ర్ క‌రుణ ర‌త్నె (18; 17 బంతుల్లో 3ఫోర్లు) హసన్ మహమూద్ బౌలింగ్‌లో (5.3వ ఓవ‌ర్‌) ముష్ఫికర్ రహీమ్ చేతికి చిక్కాడు. దీంతో 34 ప‌రుగుల వ‌ద్ద శ్రీలంక మొద‌టి వికెట్ కోల్పోయింది. 6 ఓవ‌ర్ల‌కు లంక స్కోరు 35/1. పాతుమ్ నిస్సాంక (12), కుశాల్‌ మెండిస్ (1) క్రీజులో ఉన్నారు.

 

బంగ్లాదేశ్ తుది జ‌ట్టు : మహ్మద్ నైమ్, మెహిదీ హసన్ మిరాజ్, లిట్టన్ దాస్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్‌), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్ కీప‌ర్‌), షమీమ్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహ్మద్, నసుమ్ అహ్మద్

శ్రీలంక తుది జ‌ట్టు : పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుశాల్‌ మెండిస్(వికెట్ కీప‌ర్‌), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ షనక(కెప్టెన్‌), దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరనా

ఆసియా క‌ప్ 2023 సూప‌ర్‌-4లో భాగంగా శ్రీలంక జ‌ట్టుతో బంగ్లాదేశ్ త‌ల‌ప‌డుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ ష‌కీబ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో శ్రీలంక మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది.