Sarfaraz Khan Becomes Father Welcomes A Baby Boy
Sarfaraz Khan : న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారీ సెంచరీతో చెలరేగిన టీమ్ఇండియా యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌కు ప్రమోషన్ లభించింది. అయితే.. అది భారత జట్టులో కాదండి.. వ్యక్తిగత జీవితంలో. అతడు తండ్రి అయ్యాడు. అతడి భార్య రొమానా జహూర్ సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఈ సంతోషకరమైన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సర్ఫరాజ్ ఖాన్ వెల్లడించాడు. బిడ్డను ఎత్తుకున్న ఫోటోలను పంచుకున్నాడు. ఈ విషయం తెలిసిన అభిమానులు, నెటిజన్లు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Kane Williamson: న్యూజిలాండ్ జట్టుకు బిగ్ షాక్.. రెండో టెస్టుకు కేన్ విలియమ్సన్ దూరం
26 ఏళ్ల సర్ఫరాజ్‌కు గతేడాది జమ్మూకశ్మీర్‌కు చెందిన రొమానా జహూర్‌తో వివాహమైంది. ఇక ఈ ఏడాది రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే నుంచి సర్ఫరాజ్ క్యాప్‌ను అందుకున్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న అతడి తండ్రి, కోచ్ అయిన నౌషద్ ఖాన్‌తో పాటు అతడి భార్య రొమానా భావోద్వేగానికి లోనైయ్యారు.
బెంగళూరు వేదికగా కివీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సర్ఫరాజ్‌కు ఇదే తొలి శతకం. కాగా.. ఈ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. పూణే వేదికగా అక్టోబర్ 24 నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది.
IND vs NZ: న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో ఆ ఇద్దరు ఆటగాళ్లపై వేటు తప్పదా.. వాళ్లెవరంటే..
Our prince has arrived! ♥️ 👑 pic.twitter.com/YHc0oq28Jm
— sarfaraz khan (@sarfarazkhan977) October 22, 2024