IND vs AUS : ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌.. భార‌త్ జ‌ట్టుకు బిగ్‌షాక్‌..!

ఈనెల 22 నుంచి పెర్త్ మైదానంలో జరిగే మొదటి టెస్టు కోసం భారత్ జట్టు ఆటగాళ్లు గురువారం ప్రాక్టీస్ చేశారు. ఈ సమయంలో టీమిండియా బ్యాటర్

Sarfaraz Khan Injury

Sarfaraz Khan Injury: బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కానుంది. తొలి టెస్టు ఈనెల 22న పెర్త్ లో జరగనుంది. ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియాకు చేరుకొని ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యారు. ఈ టెస్టు సిరీస్ భారత్ జట్టుకు ఎంతో కీలకమైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకోవాలంటే టీమిండియా ఐదు టెస్టుల్లో నాలుగు టెస్టులు గెలవాల్సి ఉంది. దీంతో ఆస్ట్రేలియా సిరీస్ ను భారత్ జట్టు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే, మొదటి టెస్ట్ కు ముందే భారత్ జట్టుకు బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ సమయంలో జట్టులోని కీలక ఆటగాడు గాయపడ్డాడు.

Also Read: Virat Kohli : వాకా మైదానంలో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్న కోహ్లీ, బుమ్రా.. వీడియో చూశారా?

మీడియా కథనాల ప్రకారం.. ఈనెల 22 నుంచి పెర్త్ మైదానంలో జరిగే మొదటి టెస్టుకోసం భారత్ జట్టు ఆటగాళ్లు గురువారం ప్రాక్టీస్ చేశారు. ఈ సమయంలో టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ గాయపడ్డాడు. న్యూజిలాండ్ తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ లో సర్ఫరాజ్ రాణించాడు. ఓ ఇన్నింగ్స్ లో సెంచరీసైతం చేశాడు. ఫామ్ లో ఉన్న సమయంలో సర్ఫరాజ్ కు ప్రాక్టీస్ సమయంలో గాయం కావటం భారత్ జట్టుకు ఇబ్బందికర విషయమే. తన మోచేతికి బలమైన గాయం అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సర్ఫరాజ్ ఖాన్ మోచేతికి గాయం కావటంతో తీవ్రనొప్పితో మైదానాన్ని వీడుతున్నట్లు వీడియోలో కనిపించింది. అయితే, సర్ఫరాజ్ గాయంపై అధికారిక సమాచారం లేదు. స్వల్ప గాయమైతే తొలి టెస్టులో ఆడే అవకాశం ఉంటుంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే తొలి టెస్టుకు సర్ఫరాజ్ దూరమయ్యే అకాశం ఉంది.

 

టెస్ట్ సిరీస్ ఇలా..
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో మొత్తం ఐదు మ్యాచ్ లు ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరగనున్నాయి.
తొలి టెస్టు ఈనెల 22 నుంచి 26వ తేదీ వరకు పెర్త్ మైదానంలో జరగనుంది.
రెండో టెస్టు డిసెంబర్ 6 నుంచి 10వ తేదీ వరకు ఆడిలైడ్ లో జరగనుంది.
మూడో టెస్టు డిసెంబర్ 14 నుంచి 18వ తేదీ వరకు బ్రిస్బేన్ లో జరగనుంది.
నాలుగో టెస్టు డిసెంబర్ 26 నుంచి 30వ తేదీ వరకు మెల్బోర్న్ లో జరగనుంది.
ఐదో టెస్టు జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు సిడ్నీలో జరగనుంది.