Virat Kohli : వాకా మైదానంలో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్న కోహ్లీ, బుమ్రా.. వీడియో చూశారా?
మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో 0-3 తేడాతో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురైంది టీమ్ఇండియా.

Kohli and Bumrah sweat it out in intense nets session at WACA
Virat Kohli : మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో 0-3 తేడాతో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురైంది టీమ్ఇండియా. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌ను 4-0 తేడాతో గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో ఈ సిరీస్ కోసం టీమ్ఇండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. కాగా.. ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.
వాకా మైదానంలో టీమ్ఇండియా ప్లేయర్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్టున్నారు. కాగా.. గత కొన్నాళ్లుగా పేలవ ఫామ్‌తో ఇబ్బందులు పడుతున్న విరాట్ కోహ్లీ ప్రాక్టీస్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో కోహ్లీ షాట్లు ఆడుతూ కనిపించాడు.
SA vs IND : చరిత్ర సృష్టించిన తెలుగు తేజం తిలక్ వర్మ.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒకే ఒక్కడు
ఫ్యాక్స్ క్రికెట్ ప్రకారం నెట్స్‌లో కోహ్లీ దాదాపు 30 నిమిషాల పాటు బ్యాటింగ్ చేశాడు. ఇక వీడియోలో శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్‌లు ప్రాక్టీస్ చేస్తుండగా కోచ్ గౌతమ్ గంభీర్ నిశితంగా పరిశీలన చేస్తుండడాన్ని చూడొచ్చు.
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది.
భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ షెడ్యూల్..
* మొదటి టెస్టు – నవంబర్ 22 నుంచి 26 వరకు – వేదిక పెర్త్
* రెండో టెస్టు – డిసెంబర్ 6 నుంచి 10 వరకు – అడిలైడ్
*మూడో టెస్టు – డిసెంబర్ 14 నుంచి 18 వరకు – బ్రిస్బేన్
* నాలుగో టెస్టు – డిసెంబర్ 26 నుంచి 30 వరకు – మెల్‌బోర్న్
* ఐదో టెస్టు – జనవరి 3 నుంచి 7 వరకు – సిడ్నీ
SA vs IND : ఎవడ్రా వీడు..? కెరీర్ ఫస్ట్ బాల్‌కే సిక్స్ కొట్టాడు.. వీడియో
First look at Virat Kohli at the Perth nets ahead of the Test series opener 🏏
Some fans went the extra mile to catch a glimpse of the King 👀#AUSvIND pic.twitter.com/pXDEtDhPeY
— Fox Cricket (@FoxCricket) November 14, 2024