SA vs IND : చరిత్ర సృష్టించిన తెలుగు తేజం తిలక్ వర్మ.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒకే ఒక్కడు
టీమ్ ఇండియా యువ ఆటగాడు, తెలుగు తేజం తిలక్ వర్మ అరుదైన ఘనత సాధించాడు.

Tilak Varma creates history becomes youngest batter to score T20 century vs SA
SA vs IND : టీమ్ ఇండియా యువ ఆటగాడు, తెలుగు తేజం తిలక్ వర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికా పై సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో అతడు ఈ రికార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్లో 56 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 107 పరుగులతో అజేయంగా నిలిచాడు.
తిలక్ వర్మ 22 ఏళ్ల 4 రోజుల వయసులో దక్షిణాఫ్రికాపై శతకం బాదాడు. ఈ జాబితాలో సురేశ్ రైనా (23 ఏళ్ల 156 రోజులు), మార్టిన్ గుప్టిల్ (26 ఏళ్ల 84 రోజులు) వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నారు.
SA vs IND : ఎవడ్రా వీడు..? కెరీర్ ఫస్ట్ బాల్‌కే సిక్స్ కొట్టాడు.. వీడియో
దక్షిణాఫ్రికా పై పిన్న వయసులో శతకం బాదిన ఆటగాళ్లు వీరే..
* తిలక్ వర్మ(భారత్) – 22 ఏళ్ల 4 రోజులు – సెంచూరియన్ వేదికగా (2024లో)
* సురేశ్ రైనా(భారత్) – 23 ఏళ్ల 156 రోజులు – గ్రాస్ ఐస్‌లెట్ వేదికగా (2010లో)
* మార్టిన్ గఫ్టిల్(న్యూజిలాండ్) – 26 ఏళ్ల 84 రోజులు – లండన్ వేదికగా (2012లో)
* బాబర్ ఆజాం(పాకిస్తాన్) – 26 ఏళ్ల 181 రోజులు – సెంచూరియన్ వేదికగా (2021లో)
* క్రిస్ గేల్(వెస్టిండీస్) – 27 ఏళ్ల 355 రోజులు – జొహన్నస్‌బర్గ్ (2007లో)
ఇక భారత్ తరుపున టీ20ల్లో పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో తిలక్ వర్మ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో యశస్వి జైస్వాల్ తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తరువాత వరుసగా గిల్, రైనాలు ఉన్నారు.
Tilak Varma : సెంచరీ తరువాత తిలక్ వర్మ కామెంట్స్.. అంత ఈజీ ఏం కాదు..
భారత్ తరఫున పిన్న వయసులో టీ20ల్లో సెంచరీ సాధించిన ఆటగాళ్లు..
* యశస్వి జైస్వాల్ – 21 ఏళ్ల 279 రోజులు – నేపాల్ పై (2023లో)
* తిలక్ వర్మ- 22 ఏళ్ల 4 రోజులు – దక్షిణాఫ్రికా పై (2024లో)
* శుభ్‌మన్ గిల్ – 23 ఏళ్ల 146 రోజులు – న్యూజిలాండ్ పై (2023లో)
* సురేశ్ రైనా – 23 ఏళ్ల 156 రోజులు – దక్షిణాఫ్రికా పై (2010లో)
Thunderstruck ❌
Tilak-struck 💯A superb maiden century for the stylish #TeamIndia southpaw! 🙌
Catch LIVE action from the 3rd #SAvIND T20I on #JioCinema, #Sports18, and #ColorsCineplex! 👈#JioCinemaSports #TilakVarma pic.twitter.com/L7MEfEPyY8
— JioCinema (@JioCinema) November 13, 2024