SA vs IND : ఎవ‌డ్రా వీడు..? కెరీర్‌ ఫ‌స్ట్ బాల్‌కే సిక్స్ కొట్టాడు.. వీడియో

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో త‌న ప్ర‌యాణాన్ని ఘ‌నంగా మొద‌లుపెట్టాడు ర‌మ‌ణ్ దీప్ సింగ్‌.

SA vs IND : ఎవ‌డ్రా వీడు..? కెరీర్‌ ఫ‌స్ట్ బాల్‌కే సిక్స్ కొట్టాడు.. వీడియో

Ramandeep Singh Smashes First-Ball Six on T20I Debut

Updated On : November 14, 2024 / 10:38 AM IST

SA vs IND : అంత‌ర్జాతీయ క్రికెట్‌లో త‌న ప్ర‌యాణాన్ని ఘ‌నంగా మొద‌లుపెట్టాడు ర‌మ‌ణ్ దీప్ సింగ్‌. సెంచూరియ‌న్ వేదిక‌గా బుధ‌వారం ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ర‌మ‌ణ్‌దీప్ సింగ్ అరంగ్రేటం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆఖ‌ర్లో క్రీజులోకి వ‌చ్చిన ర‌మ‌ణ్ దీప్ సింగ్ మొత్తంగా 6 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్నాడు. ఓ ఫోర్‌, ఓ సిక్స్ బాది 15 ప‌రుగులు చేసి దుర‌దృష్ట వ‌శాత్తు ర‌నౌట్‌గా వెనుదిరిగాడు.

సాధార‌ణంగా ఆట‌గాళ్లు అంత‌ర్జాతీయ క్రికెట్ అరంగ్రేట మ్యాచ్ ఆడుతున్న స‌మ‌యంలో కొంత బెరుకుగా ఉంటారు. ముందుగా క్రీజులో కుదురుకునేందుకు స‌మ‌యం తీసుకుంటారు ఆ త‌రువాత త‌మ‌దైన శైలిలో బ్యాటింగ్ చేస్తుంటారు. అయితే.. ర‌మ‌ణ్‌దీప్ సింగ్‌కు మాత్రం తొలి మ్యాచ్ ఆడుతున్నాన‌నే బెరుకే లేదు. అత‌డు ఆడిన తొలి బంతినే సిక్స్‌గా మ‌లిచాడు.

Tilak Varma : సెంచ‌రీ త‌రువాత తిల‌క్ వ‌ర్మ కామెంట్స్‌.. అంత ఈజీ ఏం కాదు..

సిమ‌ల‌నే వేసి 18వ ఓవ‌ర్‌లో రింకూ సింగ్ ఔట్ అయిన త‌రువాత రమ‌ణ్‌దీప్ సింగ్ క్రీజులోకి వ‌చ్చాడు. తాను ఆడిన మొద‌టి బంతినే మిడాన్ దిశ‌గా సిక్స్‌గా మ‌లిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీంతో అత‌డిని నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు. ఎవ‌డ్రా వీడు ఫ‌స్ట్ బాల్‌నే సిక్స్‌గా మ‌లిచాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈమ్యాచ్‌లో భార‌త్ 11 ప‌రుగుల తేడాతో గెలిచింది. తిల‌క్ వ‌ర్మ (107 నాటౌట్; 56 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స‌ర్లు), అభిషేక్ శర్మ (50; 25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) మెరుపులు మెరిపించ‌డంతో భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 219 ప‌రుగులు చేసింది. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో ద‌క్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 208 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.

IND vs SA: మిల్లర్ బ్యాడ్‌లక్.. బౌండరీ లైన్ వద్ద అక్షర్ పటేల్ సూపర్ క్యాచ్.. వీడియో వైరల్