Tilak Varma : సెంచరీ తరువాత తిలక్ వర్మ కామెంట్స్.. అంత ఈజీ ఏం కాదు..
సెంచూరియన్ వేదికగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడాడు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ.

Tilak Varma comments after match winning century vs South Africa
Tilak Varma : సెంచూరియన్ వేదికగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడాడు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. 56 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 107 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. టీ20ల్లో అతడికి ఇదే తొలి సెంచరీ. ఇక మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ పై స్పందించాడు.
ప్రస్తుతం తన అనుభూతిని మాటల్లో చెప్పలేకపోతున్నానని అన్నాడు. దేశం తరుపున ఆడాలనేది తన కల అని చెప్పాడు. ‘జట్టుకు అవసరమైన సమయంలో ఈ శతకం సాధించాను. ఇందుకు కెప్టెన్ సూర్యకుమార్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అతడు నాకు మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చాడు. స్వేచ్ఛగా ఆడుతూ.. నన్ను నేను నిరూపించుకోవాలని సూచించాడు. ఈ సెంచరీ క్రెడిట్ అతడికే దక్కుతుంది.’ అని తిలక్ వర్మ అన్నాడు.
IND vs SA: మిల్లర్ బ్యాడ్‌లక్.. బౌండరీ లైన్ వద్ద అక్షర్ పటేల్ సూపర్ క్యాచ్.. వీడియో వైరల్
ఇక పిచ్ అంత సులువుగా లేదన్నాడు. అభిషేక్ శర్మ ఔటైన తరువాత వచ్చిన కొత్త బ్యాటర్లకు అంత ఈజీగా లేదన్నాడు. అందుకనే తాను ఎక్కువ సేపు క్రీజులో ఉండాలని నిర్ణయించుకున్నానని, మరో భాగస్వామ్యాన్ని నమోదు చేయాలని భావించినట్లు తెలిపాడు. ఈ ఇన్నింగ్స్ తనకు ఎంతో ప్రత్యేకం అని తిలక్ వర్మ అన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. తిలక్ వర్మ (56 బంతుల్లో 107 నాటౌట్) సెంచరీకి తోడు అభిషేక్ శర్మ (25 బంతుల్లో 50) మెరుపు హాఫ్ సెంచరీ బాదడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అనంతరం మార్కో జాన్నెస్ (17 బంతుల్లో 54), క్లాసెన్ (22 బంతుల్లో 41) మెరుపులు మెరిపించినప్పటికి మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 11 పరుగుల తేడాతో గెలుపొందింది.