Sarfaraz Khan father : ఉద‌యం భావోద్వేగం.. సాయంత్రం ఆనందం.. చివ‌రికి..

దేశ‌వాలీ క్రికెట్ లో ట‌న్నుల కొద్ది ప‌రుగులు, ప్ర‌తి సీజ‌న్‌లో నిల‌క‌డైన ప్ర‌ద‌ర్శ‌న‌. భార‌త ఏ జ‌ట్టు త‌రుపున అవ‌కాశం దొరికిన ప్ర‌తీ సారి స‌త్తా చాటాడు.

Sarfaraz Khan's father gets emotional as son makes Test debut in Rajkot

Sarfaraz Khan father Naushad Khan : దేశ‌వాలీ క్రికెట్ లో ట‌న్నుల కొద్ది ప‌రుగులు, ప్ర‌తి సీజ‌న్‌లో నిల‌క‌డైన ప్ర‌ద‌ర్శ‌న‌. భార‌త ఏ జ‌ట్టు త‌రుపున అవ‌కాశం దొరికిన ప్ర‌తీ సారి స‌త్తా చాటాడు. 45 ఫ‌స్ట్ క్లాస్ మ్యాచుల్లో 3912 ప‌రుగులు స‌గ‌టు 69.85 గా ఉంది. అయిన‌ప్ప‌టికీ భార‌త జ‌ట్టులో తీవ్ర‌మైన పోటీ కార‌ణంగా ఇన్నాళ్లు చోటు ద‌క్క‌లేదు. అవ‌కాశం కోసం ఎదురు చూశాడు. ఇన్నాళ్ల‌కు అత‌డికి టైమ్ వ‌చ్చింది. రాజ్‌కోట్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన మూడో టెస్టు మ్యాచ్‌తో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. అత‌డు మ‌రెవ‌రో కాదు స‌ర్ఫ‌రాజ్ ఖాన్.

అందివ‌చ్చిన అవ‌కాశాన్ని పూర్తిగా స‌ద్వినియోగం చేసుకున్న అత‌డు హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగాడు. దుర‌దృష్ట‌వశాత్తు ర‌నౌట్‌గా వెనుదిరిగాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 66 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 2సిక్స‌ర్ల‌తో 62 ప‌రుగుల‌తో రాణించాడు.

ఉద‌యం భావోద్వేగం.. సాయంత్రానికి ఆనందం..

కొడుకు టీమ్ఇండియా ఎంపిక కావ‌డంతో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్ ఆనందానికి అవ‌ధులు లేవు. ఈ ఉద‌యం స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌కు దిగ్గ‌జ ఆట‌గాడు అనిల్ కుంబ్లే టెస్టు క్యాప్‌ను అందించిన క్ష‌ణాల‌ను ద‌గ్గ‌రి నుంచి చూడ‌డంతో అత‌డికి క‌న్నీళ్లు ఆగ‌లేదు. దేనికోసం అత‌డు ఇన్నాళ్లు క‌ష్ట‌ప‌డాడ్డ‌లో ఆ స్ప‌ప్నం సాకారం అవ‌డంతో ఉద్వేగానికి లోనైయ్యాడు. టెస్టు క్యాప్ అందుకున్న అనంత‌రం స‌ర్ఫ‌రాజ్ ఖాన్ తండ్రి వ‌ద్ద‌కు వ‌చ్చి కౌగిలించుకుని అత‌డి క‌న్నీళ్లు తుడిచాడు.

రోహిత్ శ‌ర్మ ఔట్ కావ‌డంతో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ క్రీజులోకి అడుగుపెట్టాడు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌ను అల‌వోక‌గా ఎదుర్కొంటూ ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. ఈ క్ర‌మంలో 48 బంతుల్లోనే అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. అనంత‌రం త‌న బ్యాట్ ను గాల్లోకి ఎత్తి సంబురాలు చేసుకున్నాడు. ఈ స‌మ‌యంలో స్టాండ్స్‌లో ఉన్న నౌషద్ ఖాన్ కొడుకు రాణించ‌డంతో ఎగిరి గెంతులు వేశాడు. కొడుకు పై గాల్లో ముద్దుల వ‌ర్షం కురిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

అయితే.. ర‌వీంద్ర జ‌డేజాతో త‌ప్పిదం కార‌ణంగా చివ‌ర‌కు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ర‌నౌట్ అయ్యాడు. జ‌డ్డూ శ‌త‌కం కోసం త‌న వికెట్ ను త్యాగం చేశాడు. స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ర‌నౌట్ అవ్వ‌డం పై అత‌డి తండ్రి తీవ్ర ఆవేద‌న‌కు లోన‌య్యాడు.

ట్రెండింగ్ వార్తలు