Tokyo Olympics : నిరాశపరిచిన బాక్సర్ సతీశ్ కుమార్
ఒలింపిక్స్ క్రీడలు కొనసాగుతున్నాయి. భారతదేశానికి సంబంధించి..క్రీడాకారుల్లో కొంతమంది నిరుత్సాహ పరుస్తున్నారు. మరికొంత మంది పతకాల సాధించే దిశగా...సాగుతున్నారు. తాజాగా..పతకం సాధిస్తాడని అనుకున్న బాక్సర్ సతీశ్ కుమార్ నిరాశపరిచారు.

Boxing
Satish Kumar Loses : ఒలింపిక్స్ క్రీడలు కొనసాగుతున్నాయి. భారతదేశానికి సంబంధించి..క్రీడాకారుల్లో కొంతమంది నిరుత్సాహ పరుస్తున్నారు. మరికొంత మంది పతకాల సాధించే దిశగా…సాగుతున్నారు. తాజాగా..పతకం సాధిస్తాడని అనుకున్న బాక్సర్ సతీశ్ కుమార్ నిరాశపరిచారు. టోక్యో ఒలింపిక్స్ క్వార్టర్ లో భారత బాక్సర్ సతీశ్..ఓటమి పాలయ్యారు. బాక్సింగ్ 91+ కిలోల విభాగంలో ఉజ్బెకిస్థాన్ బాక్సర్ జలొలివ్ చేతిలో పరాజయం చెందారు. సతీశ్ పై 5-0 తేడాతో జలొలివ్ గెలుపొందారు.
Read More : Illicit Affair : ప్రియుడి మోజులో కన్న కొడుకు హత్య
మరోవైపు పతకం తెస్తాడన్న అంచనాలు ఉన్న టాప్ సీడ్ అమిత్ పంగాల్ (52 కిలోలు) ప్రీ క్వార్టర్ లోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు… సెమీస్‌లో ఊహించని విధంగా ఓటమిపాలైన సింధు.. నేడు మరో పోరుకు సిద్ధమైంది. కాంస్య పథకమే టార్గెట్‌గా చైనా ప్లేయర్ హి బింగ్ జియావోతో తలపడనుంది. ఆదివారం సాయంత్రం ఇద్దరు స్టార్ ప్లేయర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ గేమ్‌లో గెలిస్తే ఇండియాకు కాంస్య పథకం రానుంది.