Illicit Affair : ప్రియుడి మోజులో కన్న కొడుకు హత్య

వివాహేతర సంబంధాలతో జీవితాలు రోడ్డు పాలవుతున్నాయి. వాటి మోజులో పడి కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు. ప్రియుడి మోజులో పడి కన్నకొడుకును హతమార్చిన తల్లి కటకటాలపాలైన ఘటన రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది.

Illicit Affair : ప్రియుడి మోజులో కన్న కొడుకు హత్య

Illicit Affair

Updated On : August 1, 2021 / 11:12 AM IST

Illicit Affair : వివాహేతర సంబంధాలతో జీవితాలు రోడ్డు పాలవుతున్నాయి. వాటి మోజులో పడి కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు. ప్రియుడి మోజులో పడి కన్నకొడుకును హతమార్చిన తల్లి కటకటాలపాలైన ఘటన రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది.

సీతంపేటలో నివసించే మల్లెమొగ్గల లక్ష్మి,  బోనం దాసు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. లక్ష్మికి   మంజునాధ్ అనే 6 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. వారిద్దరి సుఖాలకు  బాలుడు అడ్డం వస్తున్నాని భావించిన లక్ష్మి బాలుడిని గొంతు పిసికి హత్యాయత్నం చేసింది. కొన ఊపిరితో ఉన్నబాలుడ్ని  రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించింది. బాలుడు మంచంపై నుంచి పడిపోయి, గాయపడినట్టు పోలీసులకు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఆ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశాడు.

మంజునాధ్ తల, మెడ, ముఖంపై గాయాలు ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. బాలుడిది సహజ మరణం కాదని భావించిన పోలీసులు పోస్టుమార్టం రిపోర్టుతో పాటు స్ధానికుల నుంచి వివరాలు సేకరించారు. పోలీసుల విచారణలో లక్ష్మి బోనందాసు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం బయటపడింది. తమ దైన స్టైల్లో లక్ష్మి నివిచారించేసరికి నిజం ఒప్పుకుంది. లక్ష్మీని ఆమెప్రియుడు దాసును పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.