Shakib Al Hasan need one wicket to reach 500 T20 wickets milestone
Shakib Al Hasan : టీ20 క్రికెట్‌లో బంగ్లాదేశ్ వెటరన్ ఆటగాడు షకీబ్ అల్ హసన్ (Shakib Al Hasan ) అరుదైన ఘనతకు అడుగుదూరంలో ఉన్నాడు. ఇంకొక్క వికెట్ తీస్తే అతడు టీ20 క్రికెట్‌లో 500 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటి వరకు పొట్టి ఫార్మాట్‌లో 500కి పైగా వికెట్లు తీసిన ఆటగాళ్లు కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు.
టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. 486 మ్యాచ్‌ల్లో 658 వికెట్లు సాధించాడు. ఆ తరువాత డ్వేన్ బ్రావో, సునీల్ నరైన్, ఇమ్రాన్ తాహిర్‌లు ఉన్నారు.
Shreyas Iyer : ఇంతకన్నా ఏం చేయాలి.. శ్రేయస్ అయ్యర్ తండ్రి ఆవేదన..
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
* రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్) – 486 మ్యాచ్‌ల్లో 658 వికెట్లు
* డ్వేన్ బ్రావో (వెస్టిండీస్) – 582 మ్యాచ్‌ల్లో 631 వికెట్లు
* సునీల్ నరైన్ (వెస్టిండీస్)- 556 మ్యాచ్‌ల్లో 590 వికెట్లు
* ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా)- 435 మ్యాచ్‌ల్లో 549 వికెట్లు
* షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) – 455 మ్యాచ్‌ల్లో 499 వికెట్లు
ఇక షకీబ్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు అతడు 455 మ్యాచ్‌లు (అంతర్జాతీయ, ఫ్రాంఛైజీ క్రికెట్)ఆడాడు. 499 వికెట్లు తీశాడు. ప్రస్తుతం అతడు కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఆడుతున్నాడు.
Rohit Sharma : ఆస్ట్రేలియా టూర్‌కు ముందు రోహిత్ శర్మ కీలక నిర్ణయం..!
ఈ మెగాటోర్నీలో అతడు ఆంటిగ్వా అండ్ బార్చుడా ఫాల్కన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. శనివారం (ఆగస్టు 23) గయానా అమెజాన్ వారియర్స్‌తో ఆంటిగ్వా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్ తీస్తే షకీబ్ 500 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు.