PAK vs BAN : థ‌ర్డ్ అంపైర్ రాంగ్‌.. నేను రైట్‌.. ఫీల్డ్ అంపైర్ల‌తో పాకిస్తాన్ కెప్టెన్ వాగ్వాదం..

పాకిస్తాన్‌, బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ బుధ‌వారం ప్రారంభ‌మైంది.

Shan Masood argues with umpire

PAK vs BAN first Test : పాకిస్తాన్‌, బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ బుధ‌వారం ప్రారంభ‌మైంది. తొలి రోజు ఆట‌కు వ‌రుణుడు అంత‌రాయం క‌లిగించాడు. దీంతో కేవ‌లం 41 ఓవ‌ర్ల ఆట మాత్ర‌మే జ‌రిగింది. తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి పాకిస్తాన్ నాలుగు వికెట్లు కోల్పోయి 158 ప‌రుగులు చేసింది. ఓపెనర్ సయీమ్ అయుబ్ (56)తో పాటు సౌద్ షకీల్‌ (57 నాటౌట్ ) లు హాఫ్ సెంచ‌రీలు బాదారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.  బంగ్లా బౌల‌ర్ల ధాటికి అబ్దుల్లా షఫికీ (2), షాన్ మసూద్ (6), బాబర్ అజామ్ (డకౌట్) విఫ‌లం అయ్యారు. దీంతో 16 ప‌రుగుల‌కే మూడు కీల‌క వికెట్లు కోల్పోయింది. అయితే.. ఓపెన‌ర్ సయీమ్ అయుబ్ తో పాటు సౌద్ ష‌కీల్‌లు ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దారు. నాలుగో వికెట్‌కు 98 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని న‌మోదు చేశారు.

Shreyas Iyer : ఇక్క‌డ సీటు ఇస్తే.. జ‌ట్టులో చోటు ఇస్తాడ‌ని అనుకుంటివా? శ్రేయ‌స్ అయ్య‌ర్‌, రోహిత్ శ‌ర్మ‌ల వీడియో వైర‌ల్‌

చ‌ర్చ‌నీయాంశంగా మారిన పాక్ కెప్టెన్ ఔట్‌..

ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ కెప్టెన్ షాన్ మ‌సూద్ విఫ‌లం అయ్యాడు. కేవ‌లం 6 ప‌రుగులే చేశాడు. షోరిపుల్ ఇస్లామ్ వేసిన బంతిని అత‌డు డిఫెన్స్ ఆడేందుకు ప్ర‌య‌త్నించాడు. అయితే.. బంతి బ్యాట్‌, ప్యాడ్ల మ‌ధ్య‌ల్లోంచి వెళ్లింది. కీప‌ర్ లిట‌న్ దాస్ చేతుల్లో ప‌డింది. బంగ్లా ఫీల్డ‌ర్లు అప్పీల్ చేయ‌గా ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. బంగ్లా రివ్య్వూకి వెళ్లింది. అల్ట్రాఎడ్జ్‌లో బంతి బ్యాట్‌ను తాకిన‌ట్లుగా వ‌చ్చింది. దీంతో థ‌ర్డ్ అంపైర్ పాక్ కెప్టెన్‌ను ఔట్‌గా ప్ర‌క‌టించాడు.

థ‌ర్డ్ అంపైర్ నిర్ణ‌యం పై షాన్ మ‌సూద్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. తాను నాటౌట్ అంటూ ఫీల్డ్ అంపైర్ల‌తో వాదించాడు. బంతి బ్యాట్‌ను తాక‌లేద‌ని, ప్యాడ్‌ను తాకిన‌ట్లుగా అత‌డు చెప్పుకొచ్చాడు. అయితే.. థ‌ర్డ్ అంపైర్ ఔట్ ఇవ్వ‌డంతో తామేమీ చెయ్య‌లేమ‌ని చెప్ప‌డంతో అసంతృప్తిగా మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అంపైర్ నిర్ణ‌యం పై ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. బంతి బ్యాట్‌ను తాకిందో, లేదా ప్యాడ్‌ను తాకిందో స్ప‌ష్ట‌త లేదంటున్నారు. అప్పుడు బ్యాట‌ర్‌కు ఫేవ‌రెట్‌గా నిర్ణ‌యం ఉండాల‌ని అంటున్నారు.

Samit Dravid : స‌మిత్ ద్ర‌విడ్ ఇన్‌సైడ్ ఔట్ షాట్ చూశారా..? ద్ర‌విడ్ కొడుకు ప‌వ‌ర్ హిట్ట‌రే..!

ట్రెండింగ్ వార్తలు